Viral Video | త‌న‌కు తానే కాటేసుకున్న పాము.. విల‌విల‌లాడిన దేహం

Viral Video | పాముల పేరు విన‌గానే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఇది మ‌న వ‌ర‌కు. మ‌రి ఒక వేళ పాముల‌కే ప్ర‌మాదం పొంచి ఉంటే.. ఆ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునేందుకు పాములు ప్ర‌య‌త్నిస్తాయి. అటు నుంచి వెళ్లేందుకు పాములు య‌త్నిస్తాయి. ఒక వేళ ఏదైనా అడ్డంకిగా మారితే దాన్ని కాటేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తాయి పాములు. ఈ కాటేసే పాముల్లో నాగుపాము, ర‌క్త‌పింజ‌ర చాలా ప్ర‌మాద‌క‌రం. నాగుపాము క‌రిస్తే నాడీ వ్య‌వ‌స్థ‌పై, […]

Viral Video | త‌న‌కు తానే కాటేసుకున్న పాము.. విల‌విల‌లాడిన దేహం

Viral Video |

పాముల పేరు విన‌గానే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఇది మ‌న వ‌ర‌కు. మ‌రి ఒక వేళ పాముల‌కే ప్ర‌మాదం పొంచి ఉంటే.. ఆ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునేందుకు పాములు ప్ర‌య‌త్నిస్తాయి. అటు నుంచి వెళ్లేందుకు పాములు య‌త్నిస్తాయి. ఒక వేళ ఏదైనా అడ్డంకిగా మారితే దాన్ని కాటేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తాయి పాములు.

ఈ కాటేసే పాముల్లో నాగుపాము, ర‌క్త‌పింజ‌ర చాలా ప్ర‌మాద‌క‌రం. నాగుపాము క‌రిస్తే నాడీ వ్య‌వ‌స్థ‌పై, ర‌క్త‌పింజ‌ర క‌రిస్తే కండ‌రాల‌పై విష ప్ర‌భావం ప‌డుతుంది. ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంది. మ‌రి అలాంటి విష‌పూరిత‌మైన ర‌క్త‌పింజ‌ర త‌న‌కు తానే కాటేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఆడ్లీ టెర్రిఫైయింగ్ పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ ఖాతాలో ర‌క్త‌పింజ‌ర కాటేసుకున్న వీడియోను పోస్టు చేశారు. అయితే ర‌క్త‌పింజ‌ర త‌ల తెగిపోయింది. అయిన‌ప్ప‌టికీ దాని త‌ల‌, దేహంలో క‌ద‌లిక‌లు ఉన్నాయి. దేహాంతో పాము నేల‌పై పొర్లుతూ కొట్టుకుంటూనే ఉంది. అంత‌లోనే ర‌క్త‌పింజ‌ర దేహం వేరుగా ప‌డి ఉన్న త‌ల‌కు తాకింది. ఇంకేముంది ర‌క్త‌పింజ‌ర నోరు తెరిచి.. దేహాన్ని ప‌లుమార్లు కాటేసింది. దీంతో పాము దేహం విల‌విలలాడిపోయింది. ఈ భ‌యంక‌ర‌మైన దృశ్యంపై మీరూ ఓ లుక్కేయండి.