Putin VS Wagner | పుతిన్‌పై.. వాగ్న‌ర్ గ్రూప్ తిరుగుబాటు..

Putin VS Wagner | ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్య (Ukraine Invasion) లో ర‌ష్యా (Russia) కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ర‌ష్యా సైన్యంపై తిరుగుబాటు చేయాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యా త‌ర‌పున ఉక్రెయిన్ యుద్ధంలో కీల‌క పాత్ర పోషించిన ప్రైవేటు సైన్యం.. వాగ్న‌ర్ గ్రూప్ (Wagner Group) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వాగ్న‌ర్ గ్రూప్ అధిప‌తి యెవ్‌జెనీ ప్రిగోజిన్‌ను అరెస్టు చేయాల‌ని ర‌ష్యా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ర‌ష్యా యువ‌కులు త‌మ సైన్యంలో చేరాల‌ని, […]

  • By: krs    latest    Jun 24, 2023 8:42 AM IST
Putin VS Wagner | పుతిన్‌పై.. వాగ్న‌ర్ గ్రూప్ తిరుగుబాటు..

Putin VS Wagner |

ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్య (Ukraine Invasion) లో ర‌ష్యా (Russia) కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ర‌ష్యా సైన్యంపై తిరుగుబాటు చేయాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యా త‌ర‌పున ఉక్రెయిన్ యుద్ధంలో కీల‌క పాత్ర పోషించిన ప్రైవేటు సైన్యం.. వాగ్న‌ర్ గ్రూప్ (Wagner Group) పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో వాగ్న‌ర్ గ్రూప్ అధిప‌తి యెవ్‌జెనీ ప్రిగోజిన్‌ను అరెస్టు చేయాల‌ని ర‌ష్యా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ర‌ష్యా యువ‌కులు త‌మ సైన్యంలో చేరాల‌ని, ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రిని అంద‌రం క‌లిసి తుద‌ ముట్టిద్దామ‌ని ప్రిగోజిన్ పిలుపునిచ్చిన‌ట్లు వార్త‌లు వచ్చాయి.

దీంతో ర‌ష్యాపై పుతిన్ కు ఇంకా అధికార బ‌ల‌ముందా లేదా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ తిరుగుబాటు ఆయ‌న అధికారానికి ముప్పు తెచ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంత‌ర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

అస‌లు ఏమ‌యింది?

ఉక్రెయిన్‌లో కీల‌క‌మైన బఖ్‌ముత్ న‌గ‌రాన్ని చేజిక్కించుకోవ‌డంతో ర‌ష్యాకు వాగ్న‌ర్ గ్రూప్ ఎంత‌గానో స‌హ‌క‌రించింది. అయితే శుక్ర‌వారం త‌మ క్యాంపుపై ర‌ష్యా సేన‌లు రాకెట్ దాడి చేశాయ‌ని వాగ్న‌ర్ గ్రూప్ ఆరోపిస్తోంది. దీనికి బాధ్య‌త ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిదేన‌ని పేర్కొంటూ త‌ప్ప‌క ప‌గ తీర్చుకుంటామ‌ని ప్ర‌తిజ్ఞ సైతం చేసింది. అంతేకాకుండా తాము వెంట‌నే ర‌ష్యా సైనిక విమానాన్ని కూల్చేశామ‌ని ప్ర‌క‌టించింది. అయితే దీనిని ఇంకా ధ్రువీక‌రించాల్సి ఉంది.

అన్ని చ‌ర్య‌లూ తీసుకున్నాం..

ఈ ప‌రిణామాల‌పై ర‌ష్యా ప్ర‌భుత్వం స్పందించింది. అన్ని విష‌యాల‌ను, ప‌రిస్థితిని అధ్య‌క్షుడు పుతిన్‌కు చేర‌వేశామ‌ని క్రెమ్లిన్ అధికార ప్ర‌తినిధి తెలిపారు. అన్ని త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆయ‌న ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు మాస్కోలో అన్ని ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, మంత్రుల నివాసాల‌కు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. పుతిన్ 24 గంట‌లూ ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నార‌ని, ఆయ‌న ఆదేశాలు తుచ త‌ప్ప‌కుండా అమ‌లయ్యేలా చూసుకుంటున్నార‌ని ర‌ష్యా అధికార మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి.