మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
విధాత: మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మునుగోడులో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితానే పరిగణనలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని బీజేపీ పిటిషన్‌లో కోరింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. మునుగోడులో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని, కొత్తగా 25 వేల మంది ఓట్లు నమోదు చేసుకున్నారని.. […]

విధాత: మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మునుగోడులో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
జులై 31 వరకు ఉన్న ఓటరు జాబితానే పరిగణనలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని బీజేపీ పిటిషన్‌లో కోరింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. మునుగోడులో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని, కొత్తగా 25 వేల మంది ఓట్లు నమోదు చేసుకున్నారని.. ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయిని తెలిపారు.
ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. మునుగోడు ఓటర్ల తుదిజాబితాను ఈసీ ఇంకా ప్రకటించలేదని, ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం 2.38 లక్షల ఓటర్లు ఉన్నారని, కొత్తగా నమోదైన 25 వేల ఓట్లలో 7 వేలు తొలిగించారని ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని ఈసీ తరఫున న్యాయవాది అవినాశ్ కోర్టుకు తెలిపారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఓటర్ల జాబితాపై నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు మునుగోడు ఓటరు జాబితాను ఈసీ ప్రకటించనున్నది.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ ఇంచార్జ్
కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఆధ్వర్యంలో బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఓటర్ల జాబితా అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసింది.