స్టిక్కర్‌తో ఓట్ల లెక్క తేలుతుందా..!
విధాత: తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పోష్టర్, స్టిక్కర్ అంటిస్తూ ప్రభుత్వ సేవలను సాయాన్ని పదేపదే గుర్తు చేస్తూ.. ప్రజల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ఎత్తు వెనుక మరో లెక్క కూడా ఉందని అంటున్నారు. వైసీపీ ఏపీలో మొత్తం ఐదు లక్షలకు పైగా గృహ సారధులను నియమించుకుంది. వీరు ఇప్పుడున్న వలంటీర్లకు అదనం. ప్రస్తుతం ప్రతీ యాభై కుటుంబాలకు వాలంటీర్లు బాగా సన్నిహితులయ్యారు. ఇప్పుడు […]

విధాత: తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పోష్టర్, స్టిక్కర్ అంటిస్తూ ప్రభుత్వ సేవలను సాయాన్ని పదేపదే గుర్తు చేస్తూ.. ప్రజల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ఎత్తు వెనుక మరో లెక్క కూడా ఉందని అంటున్నారు.
వైసీపీ ఏపీలో మొత్తం ఐదు లక్షలకు పైగా గృహ సారధులను నియమించుకుంది. వీరు ఇప్పుడున్న వలంటీర్లకు అదనం. ప్రస్తుతం ప్రతీ యాభై కుటుంబాలకు వాలంటీర్లు బాగా సన్నిహితులయ్యారు. ఇప్పుడు త్వరలో గ్రామ సారథులు వస్తారన్నమాట. వీరు ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వానికి అనుసంధానించే పనిలో ఉంటారు. దాంతో వారంతా ప్రతి ఇంటిని టచ్ చేసి మా నమ్మకం నీవే జగన్ అన్న స్టిక్కర్లను గృహ సారధులు ఆయన ఇంటికి అతికిస్తారు.
అయితే ఇంటి యజమాని అంగీకారంతోనే ఇది అని అంటున్నారు. కానీ ఆ ఇంటి యజమాని నో చెబితే అపుడు సంగతేంటి అంటే ఇక్కడే వైసీపీ మార్క్ వ్యూహం ఉంది అని అంటున్నారు. అదెలా అంటే ఆ ఇంటికి అందుతున్న సంక్షేమ పధకాలు వాలంటీర్ ఏకరువు పెట్టి ఇన్ని పథకాలు అందుకుంటున్నరు కదా జగన్ మీ నమ్మకం అయితే స్టిక్కర్ అతికించుకోవడంలో అభ్యంతరం ఎందుకు అని అడుగుతారు.
ఇక ఎన్నికలకు ఏడాదికి పైగా వ్యవధి ఉంది. దాంతో కచ్చితంగా పధకాల కోసం అయినా చాలా మంది తన ఇంటి గోడకు వైసీపీ స్టిక్కర్ అతికిస్తారు. ఇక్కడే అసలు లెక్క తేలిపోతుంది అంటున్నరు. ఎవరు స్వచ్చందంగా తమ ఇంటికి స్టిక్కర్లు అతికించుకుంటున్నారు.. ఎవరు అయిష్టంగా ఉన్నారన్నది తెలుస్తుంది.
ఈ పోష్టర్ టెక్నీక్ తో అసలైన ఓటర్లు ఎవరన్నది తెలుస్తుంది అంటున్నారు. ఎవరు అయిష్టంగా ఉన్నారు.. ఎవరు ప్రతిపక్షానికి ఓటేస్తారు అన్నది కూడా మూడ్ బట్టి తెలిసిపోతుంది అని అంటున్నారు. దాన్నిబట్టి మున్ముందు ఆయాకుటుంబాలను ఎలా ఇటు లాక్కోవాలి..లేదా పథకాలు ఎలా ఇస్తున్నదీ.. దాన్ని బట్టి ఓటర్లు ఎలా ఓటేయాలన్నది కూడా గ్రామ సారథులు..వలంటీర్లు ఓటర్లకు వివరించి తమదారికి తెచ్చుకుంటారు అనేది ఓ ప్లాన్.. కాబట్టి స్టిక్కర్లతో పార్టీ బలం ఎంత..ప్రజా మద్దతు ఎంత అనేది తేలిపోతుంది అంటున్నారు.