ప్రభాస్ VS మహేష్: హద్దులు దాటుతున్న అభిమానులు..!

విధాత‌. సినిమా: మన స్టార్ హీరోలు అందరూ ఒకరితో ఒకరు ఎంతో క్లోజ్‌గా ఉంటారు. నిన్నటితరం సంగతి పక్కన పెడితే నేటి తరం యంగ్ స్టార్స్ అందరూ వృత్తిపరంగా పోటీ పడుతుంటారే గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వారు బాగానే ఉన్నా వారి అభిమానుల పరిస్థితి మరి దారుణంగా మారుతుంది. RRR చిత్రాన్ని ఎంతో అభిమానంతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి చేస్తే ఈ చిత్రం టైటిల్ రిలీజ్ దగ్గర నుంచి వారి […]

  • By: Somu    latest    Feb 02, 2023 12:30 PM IST
ప్రభాస్ VS మహేష్: హద్దులు దాటుతున్న అభిమానులు..!

విధాత‌. సినిమా: మన స్టార్ హీరోలు అందరూ ఒకరితో ఒకరు ఎంతో క్లోజ్‌గా ఉంటారు. నిన్నటితరం సంగతి పక్కన పెడితే నేటి తరం యంగ్ స్టార్స్ అందరూ వృత్తిపరంగా పోటీ పడుతుంటారే గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వారు బాగానే ఉన్నా వారి అభిమానుల పరిస్థితి మరి దారుణంగా మారుతుంది.

RRR చిత్రాన్ని ఎంతో అభిమానంతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి చేస్తే ఈ చిత్రం టైటిల్ రిలీజ్ దగ్గర నుంచి వారి అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరి యుద్ధానికి దిగారు. ట్రైలర్లో మా హీరోకు ప్రాధాన్యత లేదంటే ఒకరు త‌మ హీరోని స‌రిగా చూపించ‌లేద‌ని మ‌రికొంద‌రు చివ‌ర‌కు రాజమౌళిపై నిప్పులు చెరిగారు. ఒకరి హీరోతో ఒకరిని పోల్చుకుంటూ చివరికి రాజమౌళిని టార్గెట్ చేశారు.

ఇప్పుడు ఇదే తీరా చూస్తే ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి మన విజయ కేత‌నాన్ని ఎగురవేసే దిశగా సాగుతోంది. ప్రస్తుతం వంతు ప్రభాస్- మహేష్ బాబు అభిమానులకు వరకు వచ్చింది. గ‌త‌ కొంతకాలంగా సోషల్ మీడియా వరకే పరిమితమైన ఫ్యాన్స్ వార్ ఇప్పుడు హద్దులు దాటేసి రోడ్డు ఎక్కుతోంది.

వీధి పోరాటాలు, పోలీస్ స్టేషన్లు దాకా దారి తీస్తుంది. ప్రభాస్ మహేష్ ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అంతటితో ఆగక ఇద్దరు హీరోల ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ బహిరంగ యుద్దానికి దిగుతూ సవాలు విసురుతున్నారు.