సొంత సీఎంల మధ్య వార్.. తలపట్టుకుంటున్నమోదీ
ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటనలు సర్ది చెప్పలేక.. సతమతమవుతున్నమోదీ విధాత: సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సవాల్, ప్రతిసవాళ్లకు దిగటంతో మోదీ తలపట్టుకుంటున్నారు. విపక్ష పార్టీ ముఖ్యమంత్రుల విమర్శనాస్త్రాలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోదీ తన సొంత పార్టీ బీజేపీ సీఎంలే కీచులాడుకోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొత్తది కాదు. 1956లో ఇరు రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచీ కొన్ని ప్రాంతాలు తమ రాష్ట్ర పరిధిలోకే […]

- ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటనలు
- సర్ది చెప్పలేక.. సతమతమవుతున్నమోదీ
విధాత: సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సవాల్, ప్రతిసవాళ్లకు దిగటంతో మోదీ తలపట్టుకుంటున్నారు. విపక్ష పార్టీ ముఖ్యమంత్రుల విమర్శనాస్త్రాలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోదీ తన సొంత పార్టీ బీజేపీ సీఎంలే కీచులాడుకోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొత్తది కాదు. 1956లో ఇరు రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచీ కొన్ని ప్రాంతాలు తమ రాష్ట్ర పరిధిలోకే వస్తాయని ఇరువైపులా వాదులాడుకుంటున్నాయి. మహా రాష్ట్రలో ఉన్న కొన్ని సరిహద్దు గ్రామాలు కర్ణాటకలో కలపాలని తీర్మానం చేశాయని వాటిని తమ ప్రాంతంలో కలుపుకొంటామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అంటుండగా, అలాంటిదేమీ జరగదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు.
మరో వైపు కర్ణాటకలో ఉన్న కొన్ని గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని ఫడ్నవీస్ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిగా మహారాష్ట్ర సరిహద్దులోని కన్నడం మాట్లాడే గ్రామాలను తమ రాష్ట్రంలో కలపాలని బొమ్మై అంటున్నారు. వాటి సాధన కోసం ఎంత వరకైనా పోరాటానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిత్యం విమర్శల దాడి ఎదుర్కొం టున్న మోదీ స్వపార్టీ సీఎంల పోరు ఇంటిపోరుగా మారిన తీరును జీర్ణించుకోలేక పోతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు.