Warangal | వరద బాధితులకు తక్షణ పరిహారం అందించడంలో సర్కారు నిర్లక్ష్యం: సీతక్క

Warangal రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన స్పందించకపోవడం సిగ్గుచేటు మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలి ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి పంట పొలాలకు ఎకరానికి 30వేల రూపాయలు అందించి రైతులను ఆదుకోవాలి ములుగు MLA దనసరి సీతక్క డిమాండ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించి ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకుందిగాని, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణ సహాయం అందించాలనే చర్చ లేకపోవడం ఈ ప్రభుత్వ […]

Warangal | వరద బాధితులకు తక్షణ పరిహారం అందించడంలో సర్కారు నిర్లక్ష్యం: సీతక్క

Warangal

  • రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన స్పందించకపోవడం సిగ్గుచేటు
  • మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలి
  • ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి
  • పంట పొలాలకు ఎకరానికి 30వేల రూపాయలు అందించి రైతులను ఆదుకోవాలి
  • ములుగు MLA దనసరి సీతక్క డిమాండ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించి ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకుందిగాని, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణ సహాయం అందించాలనే చర్చ లేకపోవడం ఈ ప్రభుత్వ తీరుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన వరద బాధితులకు సహాయం అందించి, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులు పట్ల అసెంబ్లీలో విస్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలవల్ల వాగులు, వంకలు, జలాశయాలు, ఒర్రెలు నిండి లోతట్టు ప్రాంతాలను ముంచడం వల్ల వరదల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తంచేశారు. వరద ఉధృతి వల్ల ఇండ్లు నీటిలో మునిగిపోయి సర్వస్వం కోల్పోయారని, వరద నీటికి కొందరి ఇండ్లు మొత్తానికే కొట్టుకుపోయాయన్నారు.

ఈ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు కోతకు గురయ్యాయని, ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని, వరదల వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే ఇండ్ల నిర్మాణానికి 5లక్షల రూపాయల సహాయం అందించాలని, వరదల వల్ల నీట మునిగి సామాన్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయల తక్షణ సహాయం అందించాలని కోరారు.

తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మౌలిక వసతులు కల్పించాలని, వరద ఉధృతికి కోతకు గురైన పంట పొలాలకు ఎకరానికి 30వేల రూపాయల నష్ట పరిహారం అందించాలన్నారు.
మోటార్లు కొట్టుకుని పోయిన రైతులకు వెంటనే ఐ.టి.డి.ఏ., ఎస్.సి.కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా అందరికీ మోటార్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వరద నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి

అధికారులు వరదల వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రజలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సీతక్క కోరారు. వరద సహాయం అందరికీ అందించేలా చర్యలు చేపట్టాలిగాని, కొంతమందికే పది వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు.

ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో వర్షాల వలన అతలాకుతలమవుతుంటే తక్షణ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన చేయడం సిగ్గు చేటని అన్నారు. ప్రజలు వరదల్లో చిక్కుకుని చచ్చిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఇతర రాష్ట్ర పర్యటనలు చేయడం సమంజసం కాదని, వెంటనే అధికారులు నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూర్చేలా సర్వే చేసి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సీతక్క అన్నారు.