Warangal | పేదలకు భూమి దక్కే వరకు పోరాటం ఆగదు: సీపీఐ నేత శ్రీనివాసరావు

Warangal ఇంటి స్థలాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సీపీఐ రాష్ట్ర నేత తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ అసమర్థ విధానాలతో నివాస స్థలాలు లేని పేదవారికి భూమి సాధించే వరకు కమ్యూనిస్టులుగా రాజీలేని భూ పోరాటం కొనసాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ రావు అన్నారు. మానుకోట జిల్లాలో పార్టీ కురవి మండల సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూ పోరాట కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణం […]

Warangal | పేదలకు భూమి దక్కే వరకు పోరాటం ఆగదు: సీపీఐ నేత శ్రీనివాసరావు

Warangal

  • ఇంటి స్థలాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
  • సీపీఐ రాష్ట్ర నేత తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ అసమర్థ విధానాలతో నివాస స్థలాలు లేని పేదవారికి భూమి సాధించే వరకు కమ్యూనిస్టులుగా రాజీలేని భూ పోరాటం కొనసాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ రావు అన్నారు.

మానుకోట జిల్లాలో పార్టీ కురవి మండల సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూ పోరాట కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణం రాజన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుడిసె వాసులను ఉద్దేశించి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతి పేదకు ఇంటి స్థలం, ఇల్లు కట్టించి ఇస్తానని వాగ్దానాలు పలికిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కావస్తున్నా నేటికీ పేదలకు భూమి ఇవ్వలేదన్నారు.

ఈ అసమర్ధ ప్రభుత్వాల వలన కమ్యూనిస్టుల నాయకత్వంలో భూ పోరాటాలు కొనసాగుతున్నాయన్నారు. భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పేదవారికి ఇంటి స్థలం తీరని కోరికగా మారిపోయిందనన్నారు. ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత కాబట్టి ఇప్పటికైనా కమ్యూనిస్టులు కొనసాగించే భూ పోరాటాలను గుర్తించి, అట్టి స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాలలో వేలాది గుడిసెలు పేదలచే వేయించి అట్టి స్థలాలను సాధించుకున్న చరిత్ర సిపిఐకి ఉందనన్నారు. ఈ స్ఫూర్తితో పేదలు ఐకమత్యంగా ఉండి గుడిసెలు వేసుకున్న స్థలాన్ని సాధించేవరకు విశ్రమించొద్దని పార్టీ అండతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిపిఐ మానుకోట జిల్లా కార్యదర్శి బి.విజయసారథి సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాసు గౌడ్ ,నెల్లూరు నాగేశ్వరరావు ,బుర్ర సమ్మయ్య, తురక రమేష్, బసవ కొమరయ్య, దొంతు రామ్మూర్తి, బూర్గుల కృష్ణ, అప్పల వెంకన్న, వీరన్న రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.