WARANGAL: వృద్ధ దంపతులను మోసగించి నకిలీ పత్రాలతో భూ అక్రమణ.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీం
భూకబ్జాదారుడి ఆట కట్టించేసిన పోలీసులు అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీం రూ.13 లక్షలు రికవరీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ రంగశాయిపేటకు చెందిన శేర్ల శేర్ల మనమ్మ, చంద్రమౌళి అనే వృద్ధ దంపతులకు చెందిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన గడ్డం యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుని అరెస్టు చేశారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రమౌళి దంపతులకు […]

- భూకబ్జాదారుడి ఆట కట్టించేసిన పోలీసులు
- అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీం
- రూ.13 లక్షలు రికవరీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ రంగశాయిపేటకు చెందిన శేర్ల శేర్ల మనమ్మ, చంద్రమౌళి అనే వృద్ధ దంపతులకు చెందిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన గడ్డం యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుని అరెస్టు చేశారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రమౌళి దంపతులకు గత 48 సం.లుగా వంశపారపరంగా సర్వే. నం.272/a లోని రంగశాయిపేట శివారులో ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. శేర్ల చంద్రమౌళికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం కలదు.
తన దగ్గర ఉన్న సర్వే.నo. 178, రంగశాయిపేటలోని 622 గజాల భూమిలో ఒక 191 గజాల భూమి ని తన కూతురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేద్దామని తమకు పరిచయస్తుడైన గడ్డం యుగంధర్ అనే అతనిని సంప్రదించారు. ఇదే అధునుగా భావించిన యుగంధర్ రిజిస్ట్రేషన్ చెపిస్తానని చెప్పి వారికి చెందిన ఎకరం 20 గుంటల భూమిని వారికి తెలియకుండా మోసపూరితంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
తరువాత ఆ వృద్ద దంపతులు తాము మోసపోయామని గ్రహించిన బాధితులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఫిర్యాదు చేశారు. సిపి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఏ. సి. పి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
విచారణలో బయటపడ్డ కబ్జా బాగోతం :
గడ్డం యుగంధర్ 2010 సం.లో శేర్ల చంద్రమౌళి దగ్గర సర్వే. నం. 253/సి, 273/ఏ లోని 17 గుంటల భూమిని కొనుగులు చేశాడు. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని వారి కుటుంబానికి దగ్గర అవుతాడు. తరువాత శేర్ల చంద్రమౌళికి, అతని కొడుకులకి కుటుంబ తగాదాలు రావడంతో, దీనిని అదునుగా తీసుకున్న యుగంధర్, చంద్రమౌళి కూతురికి 191 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు , చంద్రమౌళికి సహాయం చేస్తున్నట్లుగా నటించి అదే సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి, తన కొడుకుల సంతకలని ఫోర్జరీ చేసి వాటి మద్యలో ఈ పత్రాలు కూడా పెట్టి తన పేరు మీద ఒక ఎకరం 20 గుంటల భూమిని 2015 సం.లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
తరువాత 4 నెలల వ్యవదిలో శేర్ల చంద్రమౌళి భార్య మనెమ్మ కి రైతుబంధు ఇప్పిస్తానని రిజిస్ట్రేషన్ ఆఫీసుకి తీసుకువెళ్ళి, వాళ్ళకి చెందిన సర్వే. నం. 234/ఏలో 3 ఎకరాల 25 గుంటలు భూమిని చాలా మోసపూరితం గా ఆలోచించి 10 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లుగా తనకు వరుసకు అన్న అయిన గడ్డం అశోక్ పేరు మీద తనఖా పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాల్ల దగ్గర నుంచి సంతకాలు పెట్టించుకున్నాడు.
2 సం.ల తరువాత తాము మోసపోయామని గ్రహించి, అతని దగ్గరకి వెళ్ళి అడుగగా, వారిని భయబ్రాంతులకు గురిచేసి, కోర్టు నుంచి 10 లక్షల రూపాయలు అప్పు ఉన్నట్లుగా నోటీసులు ఆ వృద్ద దంపతులకి పంపిస్తాడు, ఒక వేల కట్టకపోతే ఆ 3 ఎకరాల 25 గుంటల భూమిని కూడా తీసుకుంటా అని వాళ్ళని బయపెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఆ 3 ఎకరాల 25 గుంటల భూమిని అమ్మగా వచ్చిన 13 లక్షల డబ్బులని యుగంధర్ కి ఇచ్చారు.
విచారణలో ఇంతకుముందు గడ్డం యుగంధర్ పై వరంగల్ కమిషనర్ట్ లోని వివిధ పోలీసు స్టేషన్ లలో (08) కేసులు నమోదు అయ్యాయి. విచారణలో గడ్డం యుగందర్ తాను నకిలీ భూమి పత్రాలు సృష్టించి ఆ యొక్క ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశానని, 3 ఎకరాల 25 గుంటల భూమిని కూడా 13 లక్షలకి తనఖా పెట్టుకున్నని ఒప్పుకున్నాడు. ఇతని దగ్గర నుండి తనఖా పెట్టునకున్న డబ్బులను రూపాయలు 13 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నారు. తరువాత నిందితుడిని తదుపరి విచారణ కొరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది.
అభినందించిన సీపీ
నిందితుడు గడ్డం యుగంధర్ ని అరెస్ట్ చేసే తన దగ్గర నుంచి 13 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో చోరవ చూపిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏం. జితేందర్ రెడ్డి, ఇనస్పెక్టర్ కొమ్మూరి శ్రీనివాస్ రావు ఎసైలు నిసార్ పాషా, లవన్ కుమార్, శరత్ కుమార్ కానిస్టేబుళ్లు శ్రవణ్ కుమార్, నాగరాజు, రాజు, శ్రీనివాస్, బిక్షపతి, రాజేశ్, నవీన్, శ్రీధర్, నరేష్, కిరణ్, అబ్దుల్లా లను సి పి అభినందించారు.