కేసీఆర్‌ కుటుంబ అవినీతి పాలనను అంతమొందిస్తాం: సంజయ్‌

విధాత‌: బీ.ఎల్‌. సంతోష్‌ ఏం తప్పుచేశారని నోటీసులు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆయనకు ఫౌంహౌస్‌, అకౌంట్లు లేవన్నారు. మాలాంటి కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని, దేశం కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి బీ.ఎల్‌. సంతోష్‌ అని సంజయ్‌ తెలిపారు. నోటిసుల పేరుతో ప్రచారక్‌ను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డు కోవాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా యాత్ర పూర్తి చేసి […]

  • By: krs    latest    Nov 22, 2022 4:09 PM IST
కేసీఆర్‌ కుటుంబ అవినీతి పాలనను అంతమొందిస్తాం: సంజయ్‌

విధాత‌: బీ.ఎల్‌. సంతోష్‌ ఏం తప్పుచేశారని నోటీసులు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆయనకు ఫౌంహౌస్‌, అకౌంట్లు లేవన్నారు. మాలాంటి కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని, దేశం కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తి బీ.ఎల్‌. సంతోష్‌ అని సంజయ్‌ తెలిపారు.

నోటిసుల పేరుతో ప్రచారక్‌ను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డు కోవాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా యాత్ర పూర్తి చేసి చూపిస్తాన‌ని చెప్పారు. అలాగే కేసీఆర్‌ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించి తీరుతామ‌ని అన్నారు.

సంతోష్‌ విచారణకు సహకరించడం లేదు: సిట్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ పోలీసుల ద్వారా సంతోష్‌కు నోటీసులు అందించామ‌ని, ఆయన విచారణకు సహకరించడం లేదని సిట్‌ కోర్టుకు తెలిపింది. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు ఆపాలని ముగ్గురు నిందితులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నిందితులను వారం రోజు కస్టడీకి ఇవ్వండి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితుల తరఫున న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేశారు. విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

సిట్‌ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా: శ్రీనివాస్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ విచారణకు న్యాయవాది శ్రీనివాస్‌ హాజరయ్యారు. నేను బీజేపీ కార్యకర్తను కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు. ఒక పీఠాధిపతికి టికెట్‌ బుక్‌ చేశానని విచారణకు పిలిచారు. పిఠాధిపతికి విమానం టికెట్‌ బుక్‌ చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. పిఠాధిపతికి భక్తితో మాత్రమే టికెట్‌ బుక్‌ చేసినట్లు చెప్పారు. సిట్‌ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని తెలిపారు.