వాట్సాప్‌ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ తీసుకురాబోతున్న మెటా కంపెనీ..!

ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

వాట్సాప్‌ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ తీసుకురాబోతున్న మెటా కంపెనీ..!

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెస్సేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పటికప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచేయం చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాట్సాప్‌ యాప్‌ను వినియోగిస్తుంటారు. యూజర్లకు అవసరమైన ఫీచర్స్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తుండడంతో యూజర్లు వాట్సాప్‌ను వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన కంపెనీ.. త్వరలోనే మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది.


ఫొటోలు, వీడియోలు షేరింగ్‌కు సంబంధించి ఈ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ఇప్పటికే వాట్సాప్‌ హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడానికి వీలుగా గత సంవత్సరం 2జీబీ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం విధితమే. ఇంటర్నెట్ అవసరం లేకుండానే దగ్గరలో ఉన్న వారికి ఫొటోలు, వీడియోలు పంపించుకులా ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నలు చేస్తున్నది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ నియర్‌బై షేర్‌, ఐఓఎస్‌ ఎయిర్‌డ్రాప్‌ తరహాలో పని చేయనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని, త్వరలోనే యూజర్లందరికీ పరిచయం చేయబోతుందని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో పేర్కొంది. యూజర్స్‌ గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా ఇందులో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలిపింది.


ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి డివైజ్‌ను కదిపితే.. షేర్‌ రిక్వెస్ట్‌ వెళ్తుందని.. రిక్వెస్ట్‌కు యాక్సెప్ట్‌ తెలిపితే.. ఫైల్‌ షేరింగ్‌ మొదలవుతుందని వివరించింది. అయితే, ఫొటో, వీడియోలు, ఆడియోలను పక్కన ఉన్న వారికి అత్యంత వేగంగా షేర్‌ చేసుకునేందుకు ఇప్పటికే ‘షేర్‌ ఇట్‌’ అందుబాటులో ఉంది. అయితే, ఈ యాప్‌పై కేంద్రం నిషేధం విధించడంతో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ కోసం నియర్‌బై షేర్‌ను తీసుకువచ్చింది. తాజాగా ఫేస్‌బుక్‌ నేతృత్వంలోని వాట్సాప్‌ గూగుల్‌కు పోటీగా ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ఇదిలా ఉండగా.. వాట్సాప్‌ ఇటీవల ఐఓఎస్‌లూ యూజర్లు స్టిక్కర్లను క్రియేట్ చేయడానికి, వాటిని సవరించడానికి అవకాశం కల్పించే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోలను స్టిక్కర్‌లుగా మార్చుకునే వీలు కల్పించింది. ఇప్పటికే ఉన్న స్టిక్కర్‌లను సైతం నచ్చిన విధంగా సవరించుకునేలా ఫీచర్‌ను జోడించింది.