WhatsApp | వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌.. గూగుల్‌, జూమ్‌లో మాదిరిగా ఇక స్క్రీన్‌ షేరింగ్‌..!

WhatsApp | ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం సరికొత్తగా ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చి సంస్థ కొత్తగా మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం గూగుల్‌ మీట్‌, జూమ్‌ వీడియో కాలింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తున్నది. అప్‌డేట్‌ సిద్ధమైందని వాట్సాప్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. […]

WhatsApp | వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌.. గూగుల్‌, జూమ్‌లో మాదిరిగా ఇక స్క్రీన్‌ షేరింగ్‌..!

WhatsApp |

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం సరికొత్తగా ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చి సంస్థ కొత్తగా మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం గూగుల్‌ మీట్‌, జూమ్‌ వీడియో కాలింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తున్నది. అప్‌డేట్‌ సిద్ధమైందని వాట్సాప్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది.

వాట్సాప్‍‍లో వీడియో కాల్‍ మాట్లాడుతున్న సమయంలో అవతలి వారికి మీ స్క్రీన్‌ను ప్రెజెంట్‌ చేసేందుకు ఈ స్క్రీన్‌ షేర్‌ ఆప్షన్‌ ఉపయోగపడనున్నది. స్క్రీన్ షేర్‌పై క్లిక్ చేస్తే వీడియో కాల్‍లో ఉన్న వారందరికీ స్క్రీన్‍ను షేర్ చేయొచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా 2.23.11.19 వెర్షన్‌లో వాట్సాప్‌ అందుబాటులో ఉంచింది. బీటా టెస్టర్లు ఈ వెర్షన్‍కు అప్‍డేట్ అయి ఈ స్క్రీన్ షేర్ ఆప్షన్‍ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. వీడియోకాల్‌ మాట్లాడుతున్న సమయంలో కింద స్క్రీన్‌ షేర్‌ ఆప్షన్‌ కనిపిస్తూ ఉంటుంది.

ఈ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే ఎప్పటికప్పుడు రికార్డై.. వీడియో కాల్‌లో ఉన్న అవతలి వ్యక్తులకు ట్రాన్స్‌మీట్‌ అవుతుందని Wabetainfo తెలిపింది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్ అందుబాటులోకి రాగా.. టెస్టింగ్‌ అనంతరం సాధారణ యూజర్లందరికీ రోల్‌ అవుట్‌ చేయనున్నది.

ఫీచర్‌ ఎలాంటి బగ్స్‌ లేకుండా పని చేస్తుందని నిర్ధారించాక యూజర్లందరికీ విడుదల చేయనున్నది. ఇటీవల మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ రోల్‌ అవుట్‌ను వాట్సాప్‌ ప్రారంభించింది. రాబోయే వారాల్లో ఎడిట్‌ మెసేజ్‌ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్‌ సహాయంతో మెసేజ్‌ సెండ్‌ చేసిన 15 నిమిషా వరకు ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.