పాద‌యాత్ర చేయ‌డానికి రాఘ‌వ‌రెడ్డి ఎవ‌రు?: నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం

మతి భ్రమించి మాట్లాడుతున్నాడ‌ని ఆరోప‌ణ‌ గతంలో షోకాజ్ నోటీసు జారీ అయినా పద్ధతి మార్చుకోకుండా పార్టీకి నష్టం మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పక్క జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ హనుమకొండ జిలాల్లో పాదయాత్ర చేయడానికి జంగా రాఘవ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గ్రూప్‌లుగా తయారు చేసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ […]

పాద‌యాత్ర చేయ‌డానికి రాఘ‌వ‌రెడ్డి ఎవ‌రు?: నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం
  • మతి భ్రమించి మాట్లాడుతున్నాడ‌ని ఆరోప‌ణ‌
  • గతంలో షోకాజ్ నోటీసు జారీ
  • అయినా పద్ధతి మార్చుకోకుండా పార్టీకి నష్టం
  • మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు
  • హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పక్క జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ హనుమకొండ జిలాల్లో పాదయాత్ర చేయడానికి జంగా రాఘవ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గ్రూప్‌లుగా తయారు చేసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాజీపేటలో జంగా రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

రాఘవ రెడ్డికి పక్క జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించ వద్దని ఇది వరకే క్రమశిక్షణ సంఘం షోకాజు నోటీసు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. టిపిసిసి క్రమశిక్షణ సంఘం షో కాజ్ ను లెక్క చేయకుండా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి హన్మకొండ జిల్లాలో పర్త్యటిస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాఘవరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ ఆధారాలతో సహా టిపిసిసి క్రమశిక్షణ సంఘానికి, ఏఐసిసి నాయకులకు మరొకసారి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తను ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూరే విధంగా వ్యవహరిసున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు.