మోడీకి ఎందుకు తొందరా..? లక్షద్వీప్ ఘటన మరిచిపోయారా..?

కేరళ హైకోర్టు స్టేతో ఇచ్చిన నోటిఫికేషన్‌ వాపస్‌ తీసుకోలేదా? సుప్రీం కోర్టు కూడా కేరళ కోర్టు నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలియదా? ప్రశ్నించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విధాత: లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌కు కోర్టులో శిక్ష పడిన సందర్భంలో కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఫైజల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని, ఆనాడు కేరళ హై కోర్టు స్టే ఇచ్చిందని. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ […]

  • By: krs    latest    Mar 24, 2023 1:23 PM IST
మోడీకి ఎందుకు తొందరా..? లక్షద్వీప్ ఘటన మరిచిపోయారా..?
  • కేరళ హైకోర్టు స్టేతో ఇచ్చిన నోటిఫికేషన్‌ వాపస్‌ తీసుకోలేదా?
  • సుప్రీం కోర్టు కూడా కేరళ కోర్టు నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలియదా?
  • ప్రశ్నించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

విధాత: లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌కు కోర్టులో శిక్ష పడిన సందర్భంలో కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఫైజల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని, ఆనాడు కేరళ హై కోర్టు స్టే ఇచ్చిందని. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎందుకు తొందరా..? అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.

కేరళ హైకోర్టు ఇచ్చిన స్టేపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, అయితే సుప్రీం కోర్టు కేరళ హైకోర్టు ఇచ్చిన స్టేను సమర్థించిందని వినోద్ కుమార్ తెలిపారు. లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ఇచ్చి, కేరళ హైకోర్టు స్టేతో తిరిగి వాపస్ తీసుకోవాల్సి వచ్చిందని, ఫైజల్ ఎంపీగా కొనసాగుతున్నారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీని పార్లమెంట్ మెంబర్ పదవీ నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బహిష్కరించడం అప్రజాస్వామికమని, అనైతికమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం దేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు. సీబీఐ, ఈడీ దాడులతో విపక్ష పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తోందని తెలిపారు.

జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పిలేట్ కోర్టుకు వెళ్లే అవకాశం రాహుల్ గాంధీకి ఉంటుందని, అప్పిలెట్ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని బర్తరఫ్ చేయడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.