ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని ఎందుకు ఆపలేక పోతున్నారు: భట్టి
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగర్ ఆయకట్టు ఎండి పోతుంది ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని త్వరగా పూర్తి చేయండి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఏడాదిలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామన్న మంత్రి హరీశ్‌రావు విధాత: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు పైన నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని ఎందుకు ఆపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల పద్దుపై చర్చ సందర్భంగా ఏపీ […]

- ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సాగర్ ఆయకట్టు ఎండి పోతుంది
- ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని త్వరగా పూర్తి చేయండి
- అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క
- ఏడాదిలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామన్న మంత్రి హరీశ్‌రావు
విధాత: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు పైన నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని ఎందుకు ఆపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల పద్దుపై చర్చ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా రోజుకు 10 టీఎంసీల నీటిని తరలించే విధంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు మధ్యలో కృష్ణా నదిపై నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకోకుండా సాగర్ ఆయకట్టు ప్రాంతాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పంధించిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రాయలసీమ ఎత్తి పోతలపథకాన్ని అడ్డకోవడానికి తీవ్రంగా కృషి చేశామని, చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేసే విధంగా ఉత్తర్వులు తీసుకువచ్చామని తెలిపారు.
పాలమూరు జిల్లాల్లో ఒక్క ప్రాజెక్టును కూడ తెలంగాణ ప్రభుత్వం నిర్మంచ లేదని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించ లేక పోయారన్నారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు వస్తున్నాయన్నారు. కానీ పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రానికి ఎందుకు సమర్పించ లేదని అడిగారు. ఎస్ ఎల్‌బీసీ సొరంగాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు.
ఈ మేరకు సొరంగం పనులు పూర్తికావడానికి నిధులు కేటాయించాలనికోరారు. అలాగే కాళేశ్వరం కింద తుపాకుల గూడెం వద్ద ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. దీనిపై స్పంధించిన హరీశ్‌రావు గోదావరి నదిపై కేవలం ఈ ఎనిమిదేళ్లలో 5 బ్యారేజీలు నిర్మించామని తెలిపారు. 170 కిలో మీటర్ల మేరకు గోదావరి నదిని నిండుకుండాలా ఉంచామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను3667 కోట్ల నిధులు కేటాయించి రాత్రింబవళ్లు అక్కడే ఉండి పని చేయించామన్నారు. ఎస్ ఎల్‌బీసీ టన్నెల్ ఇప్పటికీ 36 కిలోమీటర్లు పూర్తి కావచ్చింది. కావాల్సింది 9కిలో మీటర్ల మేరకు ఉంది… త్వరలోనే పూర్తి చేయిస్తాం. ఏడాదికాలంలో ఎస్ ఎల్‌బీసీ పూర్తి చేస్తామని తెలిపారు.