MLA Bhaskara Rao: కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి.. మేం వేసిన రోడ్లపై నడవకండి! మళ్లీ నోరు జారిన MLA భాస్కరరావు
విధాత: మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారి నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేములపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలన్నారు. నాలుగు చీరలు ఇచ్చే కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేయాలా అవసరమా.. అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ వ్యాఖ్యానించారు. గతంలో అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యాడు. మళ్లీ భాస్కరరావు అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మరోసారి […]

విధాత: మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారి నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేములపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలన్నారు.
నాలుగు చీరలు ఇచ్చే కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేయాలా అవసరమా.. అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ వ్యాఖ్యానించారు. గతంలో అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యాడు. మళ్లీ భాస్కరరావు అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మరోసారి విమర్శల దాడి కొనసాగుతుంది.