Gaddar | కాంగ్రెస్ గూటికి గద్దర్ కొడుకు?
లోక్ సభకా ? అసెంబ్లీకా? Gaddar | విధాత : దివంగత విప్లవ కవి, రచయిత, గాయకుడు గద్దర్ కుమారుడు కాంగ్రెస్ లో చేరుతున్నారా? ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందా?… ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవితాంతం రాజకీయాలను, ప్రజాస్వామిక ప్రభుత్వాలను విమర్శించి, వాటిని వ్యతిరేకిస్తూ మావోయిజాన్ని ఆకళింపు చేసుకున్న గద్దర్..చివరికాలంలో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఇటీవల తెలంగాణ వచ్చిన రాహుల్ గాంధీని అలముకున్నారు. సోనియాగాంధీని సైతం కలిశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒకరకంగా […]

- లోక్ సభకా ? అసెంబ్లీకా?
Gaddar | విధాత : దివంగత విప్లవ కవి, రచయిత, గాయకుడు గద్దర్ కుమారుడు కాంగ్రెస్ లో చేరుతున్నారా? ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందా?… ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవితాంతం రాజకీయాలను, ప్రజాస్వామిక ప్రభుత్వాలను విమర్శించి, వాటిని వ్యతిరేకిస్తూ మావోయిజాన్ని ఆకళింపు చేసుకున్న గద్దర్..చివరికాలంలో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు.
ఇటీవల తెలంగాణ వచ్చిన రాహుల్ గాంధీని అలముకున్నారు. సోనియాగాంధీని సైతం కలిశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒకరకంగా గద్దర్ అంటే కొంత సానుకూలత ఉన్నట్లే అంటున్నారు. ఈక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా గద్దర్ కు ఉన్న ఇమేజిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్కెచ్ వేసారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో గద్దర్ కుమారుడు సూర్యంను హైదరాబాద్ సిటీలోని కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీకి లేదా పెద్దపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయిస్తారని అంటున్నారు. దళితుడు అయిన గద్దర్ కుటుంబానికి ఈ విధంగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గం మద్దతు పొందవచ్చని కాంగ్రెస్ ప్లాన్ అంటున్నారు. ఇదిలా ఉండగా గద్దర్ మరణం తరువాత ఆయన అంత్యక్రియలు, అయన కుటుంబానికి బాసటగా నిలిచేవిషయంలో రేవంత్ రెడ్డి ముందు నిలిచారు. ఆయనను ఆస్పత్రిలో పలుమార్లు పరామర్శించడమే కాకుండా ఆయన కన్నుమూశాక కూడా అంతిమయాత్ర వెంట ముందు నడిచారు.