కర్నె ప్రభాకర్ ‘కారు’దిగుతారా?.. నేను పార్టీ మారట్లే: ఎమ్మెల్యే పైళ్ల
విధాత: మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీకి అనేక అవస్థలు తెచ్చిపెడుతున్నది. ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నది. అయితే మొదటిసారి కంటే రెండోసారి టీఆర్ఎస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో నేతలెవరూ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేదు. దుబ్బాకలో రఘునందన్ గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. అయినా పెద్దగా నిరసన గళాలు వినిపించలేదు. ఈటల రాజేందర్ వ్యవహారం తర్వాత కూడా ఎవరూ నోరెత్తలేదు. కానీ హుజురాబాద్లో […]

విధాత: మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీకి అనేక అవస్థలు తెచ్చిపెడుతున్నది. ఆ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల జాబితా పెద్దగానే ఉన్నది. అయితే మొదటిసారి కంటే రెండోసారి టీఆర్ఎస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో నేతలెవరూ కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేదు. దుబ్బాకలో రఘునందన్ గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది.
అయినా పెద్దగా నిరసన గళాలు వినిపించలేదు. ఈటల రాజేందర్ వ్యవహారం తర్వాత కూడా ఎవరూ నోరెత్తలేదు. కానీ హుజురాబాద్లో ఈటల గెలుపు తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పైనే నేరుగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ నేతల వాయిస్ ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. తమకు అన్యాయం జరుగుతున్నదని, ఆత్మగౌరవం లేనిచోట పని చేయలేనమనే మాట మొన్న ఈటల మొదలు నేడు బూర దాకా అదే వాదన వినిపిస్తున్నారు.
అయితే ఈటల పార్టీని వీడిన తర్వాత బీజేపీలోకి వలసలు పెద్దగా పెరగలేదు. కానీ ఇటీవల కాలంలో బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై ఫోకస్ పెట్టడం, కేసీఆర్ కూడా కేంద్రంపై మాట దాడి పెంచడంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం బాగా పెరిగిపోయింది. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తూ.. అధినేతకు అండగా ఉన్నవాళ్లు ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
ఈ కోవలోనే బూర నర్సయ్య తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేయగా తర్వాత ఎవరు అనేది చర్చనీయాంశం అవుతున్నది. ఎందుకంటే రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గతంలో చెప్పిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బూర నర్సయ్య తోపాటు మునుగోడు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దారి ఎటు అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతున్నది. ప్రస్తుతం ఆయన కూడా ఢిల్లీలో మకాం వేసినట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆయన కూడా ఈటల, బూర దారిలోనే కర్నె కూడా వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. దీనిపై ఇప్పటివరకు అధికార సమాచారం లేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లలేదని హైదరాబాద్లోనే ఉన్నారని, పార్టీ సమావేశాలు, ప్రచారాల్లో పాల్గొంటారని అనుచరులు తెలుపుతున్నారు.
నేను పార్టీ మారట్లేదు: పైళ్ల శేఖర్ రెడ్డి
విధాత: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఖండించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో కొందరు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు, ఆ అవసరం రాదు కూడా. పని పాటా లేని కొందరు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు,టీఆరెఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కూడా టీఆరెఎస్ పార్టీనేనని అన్నారు. కేసీఆర్ పాలన కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పైళ్ల తెలిపారు.