ఆ ఏడు బిల్లులకు ఆమోదముద్ర పడుతుందా?

విధాత‌: బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం, గవర్నర్‌ ప్రసంగంపై హైకోర్టులో విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు చర్చలు జరిపారు. అవి సఫలమవ్వవడంతో అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. దీంతో బడ్జెట్‌ సమావేశాలపై రెండుమూడు రోజులుగా నెలకొన్నసందిగ్ధతకు తెరపడింది. గత ఏడాది సెప్టెంబర్‌ […]

ఆ ఏడు బిల్లులకు ఆమోదముద్ర పడుతుందా?

విధాత‌: బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశం, గవర్నర్‌ ప్రసంగంపై హైకోర్టులో విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు చర్చలు జరిపారు. అవి సఫలమవ్వవడంతో అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. దీంతో బడ్జెట్‌ సమావేశాలపై రెండుమూడు రోజులుగా నెలకొన్నసందిగ్ధతకు తెరపడింది.

గత ఏడాది సెప్టెంబర్‌ 13న రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదించిన ఎనిమిది బిల్లులో ఒక్క దానికి మాత్రమే గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. మిగతా ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అవి చట్టరూపం దాల్చలేదు. ఈ పెండింగ్‌ బిల్లులపై దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, గవర్నర్‌కు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.

గవర్నర్‌ దగ్గర ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులలో యూనివర్సిటీలలో నియామకాల కోసం కామన్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు బిల్లు, ప్రస్తుతం ఎన్నికైన ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే మూడేళ్ల కాలపరిమితి నాలుగేళ్లకు పెంచుతూ బిల్లు, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో కోఆప్షన్‌ సభ్యుల పెంపు, ముషీరాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంత భూములను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత కౌలు రద్దు చట్ట సవరణ బిల్లు.

135 ఎకరాల భూమిని ప్రస్తుత మార్కెట్ ధర మేరకు క్రమబద్ధీకరించేలా చట్ట సవరణను ప్రతిపాదన, రాష్ట్ర అటవీ విశ్వవిద్యాలయానికి ఛాన్స్‌లర్‌గా సీఎం వ్యవహరించేలా చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో మరిన్ని ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటునకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లు, ఆ వర్సిటీల్లో నియామకాలు చేపట్టడానికి ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేసేలా చట్ట సవరణ బిల్లు, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టసవరణ బిల్లు, తెలంగాణ మోటర్‌ వాహనాల ట్యాక్సేషన్‌ బిల్లు ఇవన్నీ గవర్నర్‌ ఆమోదం కోసం నాలుగు నెలలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.

విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డుపై గవర్నర్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమైనా ఆమోదం పొందలేదని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య దూరం పెరగడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల వాదన.

అయితే ఈ బిల్లులు కూడా ఆమోదం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ చెరో మెట్టు దిగితే పరిష్కారం దొరకవచ్చు అంటున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే వీటిపై గవర్నర్‌కు ఉన్న అభ్యంతరాలను సీఎం కేసీఆర్‌ నివృత్తి చేస్తే ఫలితం ఉండొచ్చు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలు పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృష్టి చేస్తే గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లుల ఆమోదముద్ర పడుతుంది అంటున్నారు.