జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తాం: సీపీఐ రాజా
విధాత: కాంగ్రెస్ పార్టీ పాన్ ఇండియా సెక్యులర్ పార్టీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుందని వెల్లడించారు. తాము దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులన్నింటితో కలిసి పని చేస్తామని వెల్లడించారు. దేశంలో 2024లో వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తాము అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎన్నికల పొత్తులపై ఆయా రాష్ట్ర కమిటీలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా […]

విధాత: కాంగ్రెస్ పార్టీ పాన్ ఇండియా సెక్యులర్ పార్టీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుందని వెల్లడించారు. తాము దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులన్నింటితో కలిసి పని చేస్తామని వెల్లడించారు.
దేశంలో 2024లో వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తాము అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎన్నికల పొత్తులపై ఆయా రాష్ట్ర కమిటీలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయని రాజా తెలిపారు.