Wines | వైన్స్ షాపులకు.. భారీగా దరఖాస్తులు! ఇప్పటికీ ఎన్నొచ్చాయంటే!

Wines | విధాత: కొత్త వైన్స్ షాపుల లైసెన్స్‌ల కోసం సాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన రీతిగా సాగుతుంది. గురువారం ఒక్కరోజునే 3500కుపైగా దరఖాస్తులు అందడం వైన్స్‌ షాపుల టెండర్లకు లభిస్తున్న అనూహ్యా స్పందనకు నిదర్శనం. ఇప్పటి దాకా 8000కు పైగా అందిన దరఖాస్తుల ద్వారా 1610 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లుగా అబ్కారీ వర్గాల సమాచారం. రాష్ట్రం మొతం మీద 2,620 మద్యం దుకాణాలుండగా, ఈ నెల 4వ తేది నుంచి 18వరకు దరఖాస్తులకు […]

Wines | వైన్స్ షాపులకు.. భారీగా దరఖాస్తులు! ఇప్పటికీ ఎన్నొచ్చాయంటే!

Wines |

విధాత: కొత్త వైన్స్ షాపుల లైసెన్స్‌ల కోసం సాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన రీతిగా సాగుతుంది. గురువారం ఒక్కరోజునే 3500కుపైగా దరఖాస్తులు అందడం వైన్స్‌ షాపుల టెండర్లకు లభిస్తున్న అనూహ్యా స్పందనకు నిదర్శనం. ఇప్పటి దాకా 8000కు పైగా అందిన దరఖాస్తుల ద్వారా 1610 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లుగా అబ్కారీ వర్గాల సమాచారం.

రాష్ట్రం మొతం మీద 2,620 మద్యం దుకాణాలుండగా, ఈ నెల 4వ తేది నుంచి 18వరకు దరఖాస్తులకు గడువు ఉంది. 21న లాటరీ ద్వారా టెండర్లను ఖారారు చేస్తారు. ప్రస్తుత వైన్స్ షాపులకు నవంబర్ 30వ తేది వరకు గడువు ఉంది.

డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాతా వేసవిలో పార్లమెంటు ఎన్నికలు, తదుపరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో మద్యం అమ్మకాలు బాగానే ఉంటాయన్న అంచ‌నాలు, ఆశలతో కొత్త వైన్స్‌లకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారు.

దీంతో ప్రభుత్వం మద్యం టెండర్ల ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న 15వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్న ధీమా ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తుంది. సంక్షేమ పథకాల అమలుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమున్న నేపధ్యంలో మద్యం టెండర్ల ఆదాయం ప్రభుత్వానికి అతిపెద్ద వనరుగా మారింది.