Seethakka: సిస్టర్ స్ట్రోక్‌తో.. KTR చిన్న మెదడు చితికిపోయింది

విధాత, హైదరాబాద్: సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయిందని..అందుకే సీఎం రేవంత్ రెడ్డి పై ఈడీ కేసుపైన, కాళేశ్వరం విచారణ..మేడిగడ్డ కుంగుబాటుపైన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆర్ కావచ్చని.. దెయ్యం అనేక రూపాలు మార్చుకుంటుందన్నారు. గులాబీ కూలీల రూపంలో బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు. స్వాతంత్రం కోసం పోరాడిన పత్రికకు సాయపడటం తప్ప అని సీతక్క ప్రశ్నించారు.
కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకు అని సీతక్క ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం బాంబులు పెట్టి పేల్చారంటూ మాట్లాడుతన్నారని ఎద్దేశా చేశారు. మరి మీరు అధికారంలోకి ఉండగా దానిని ఎందుకు నిరూపించలేదని నిలదీశారు. అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నంలో గ్లోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ ను మించిన వారు లేరని విమర్శించారు.
కేటీఆర్ కు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలన్నారు. అబద్దాల పునాదుల పై బీఆర్ఎస్ నడుస్తుందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మరిచిపోయారని..ప్రతిపక్ష నేతగా కేటీఆర్ పనికిరాడన్నారు. మోదీ దగ్గర ప్రశంసల కోసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తూ శునకానందం పొందుతున్నాడని విమర్శించారు. సిస్టర్ స్ట్రోక్ లాంటివి మునుముందు కేటీఆర్ మరిన్ని ఎదుర్కనేది ఉందని..ప్రజలు తాట తీస్తారని సీతక్క హెచ్చరించారు.