Viral Video | మేక పిల్ల‌ కోసం రైలు టికెట్ కొన్న వృద్ధురాలు

Viral Video | చాలా మంది టికెట్ లేకుండానే రైల్లో ప్ర‌యాణిస్తుంటారు. టీటీఈ వ‌చ్చిన‌ప్పుడు ఒక బోగీలో నుంచి మ‌రో బోగీలోకి లేదా.. వాష్‌రూమ్‌ల్లో దాక్కుంటారు. కానీ ఓ మ‌హిళ మాత్రం త‌న నిజాయితీ చాటుకుంది. త‌న‌తో పాటు త‌న మేక పిల్ల‌కు కూడా రైలు టికెట్ కొనుగోలు చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రైలులో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌ను టీటీఈ టికెట్ అడిగాడు. మేక పిల్ల‌కు కూడా టికెట్ తీసుకున్నావా? […]

  • By: raj    latest    Sep 08, 2023 3:48 AM IST
Viral Video | మేక పిల్ల‌ కోసం రైలు టికెట్ కొన్న వృద్ధురాలు

Viral Video | చాలా మంది టికెట్ లేకుండానే రైల్లో ప్ర‌యాణిస్తుంటారు. టీటీఈ వ‌చ్చిన‌ప్పుడు ఒక బోగీలో నుంచి మ‌రో బోగీలోకి లేదా.. వాష్‌రూమ్‌ల్లో దాక్కుంటారు. కానీ ఓ మ‌హిళ మాత్రం త‌న నిజాయితీ చాటుకుంది. త‌న‌తో పాటు త‌న మేక పిల్ల‌కు కూడా రైలు టికెట్ కొనుగోలు చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రైలులో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌ను టీటీఈ టికెట్ అడిగాడు. మేక పిల్ల‌కు కూడా టికెట్ తీసుకున్నావా? అని అడిగేస‌రికి అవును అని ఆమె స‌మాధానం ఇచ్చింది. టికెట్ చూపిస్తూ ఆమె న‌వ్వింది. వృద్ధురాలి నిజాయితీకి టీటీఈ కూడా ఫిదా అయిపోయారు. అయితే వృద్ధురాలు బెంగాలీ భాష‌లో మాట్లాడింది. అంటే ఆమె ప‌శ్చిమ బెంగాల్ మార్గంలో వెళ్లే రైల్లో ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది. ఈ వీడియోను బ్యూరోక్రాట్ అవ‌నీష్ శ‌ర‌ణ్ త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లో పోస్టు చేశారు.