సిద్దిపేటలో దారుణం: బతుకమ్మ ఆడుతుండగానే.. వివాహిత హత్య
విధాత: తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని కక్ష పెంచుకున్న భర్త.. ఆమె బతుకమ్మ ఆడుతుండగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వీరాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, ఎల్లమ్మ అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మంగకు స్థానికుడైన ఎల్లారెడ్డితో పెళ్లి చేశారు. ఆమె నెల రోజులకే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని, ఆత్మహత్య చేసుకుంది. ఆ […]

విధాత: తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని కక్ష పెంచుకున్న భర్త.. ఆమె బతుకమ్మ ఆడుతుండగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వీరాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, ఎల్లమ్మ అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మంగకు స్థానికుడైన ఎల్లారెడ్డితో పెళ్లి చేశారు. ఆమె నెల రోజులకే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని, ఆత్మహత్య చేసుకుంది.
ఆ తర్వాత అదే ఎల్లారెడ్డికి రెండో కూతురు స్వప్నను ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఆరేండ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న రమేశ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు గొడవలయ్యాయి. రమేశ్‌కు దూరంగా ఉండాలని భర్త హెచ్చరించాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం రాత్రి స్వప్న బతుకమ్మ ఆడుతుండగా, ఇనుప రాడ్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.