Heart | సీసాలో.. త‌న గుండెను చూసుకుని యువతి ఉద్వేగం

Heart | విధాత: మ‌న గుండెను మ‌న‌మే ఓ మ్యూజియంలో చూసుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో క‌దా..? ఇదే ప్ర‌శ్న‌ను 38 ఏళ్ల బ్రిట‌న్ యువ‌తి జెన్నీఫ‌ర్ సట‌న్‌ను అడిగితే మాట‌ల్లో వ‌ర్ణించలేం అని చెబుతుంది. జెన్నీకి 22 ఏళ్ల వ‌య‌సున్న‌పుడు అంటే 2007లో ఆమెకు గుండె మార్పిడి శ‌స్త్రచికిత్స జ‌రిగింది. దీంతో వైద్యులు ప‌రిశోధ‌న కోస‌మ‌ని త‌న గుండెను భ‌ద్ర‌ప‌రిచారు. ఇటీవ‌ల దానిని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన లండ‌న్‌లోని హంటేరియ‌న్ మ్యూజియంకు జెన్నీ వెళ్లింది. ఆప‌రేష‌న్ […]

  • By: krs    latest    May 23, 2023 7:03 AM IST
Heart | సీసాలో.. త‌న గుండెను చూసుకుని యువతి ఉద్వేగం

Heart |

విధాత: మ‌న గుండెను మ‌న‌మే ఓ మ్యూజియంలో చూసుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో క‌దా..? ఇదే ప్ర‌శ్న‌ను 38 ఏళ్ల బ్రిట‌న్ యువ‌తి జెన్నీఫ‌ర్ సట‌న్‌ను అడిగితే మాట‌ల్లో వ‌ర్ణించలేం అని చెబుతుంది. జెన్నీకి 22 ఏళ్ల వ‌య‌సున్న‌పుడు అంటే 2007లో ఆమెకు గుండె మార్పిడి శ‌స్త్రచికిత్స జ‌రిగింది.

దీంతో వైద్యులు ప‌రిశోధ‌న కోస‌మ‌ని త‌న గుండెను భ‌ద్ర‌ప‌రిచారు. ఇటీవ‌ల దానిని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన లండ‌న్‌లోని హంటేరియ‌న్ మ్యూజియంకు జెన్నీ వెళ్లింది. ఆప‌రేష‌న్ అయిన సుమారు 16 ఏళ్ల త‌ర్వాత అక్క‌డే గాజు సీసాలో భ‌ద్ర‌ప‌రిచి ఉన్న తన గుండెను చూసుకుని ఉద్వేగానికి గుర‌యింది.

‘ఇది ఒక చెప్ప‌లేని అనుభూతి. ఇప్పుడు గాజు సీసాలో ఉన్న ఆ గుండె ఒక‌ప్పుడు నాలో భాగంగా ఉండేదంటే న‌మ్మ‌లేక‌పోతున్నా. ఏదేమైనా అది నాకు 22 ఏళ్లు బ‌తుకునిచ్చింది’ అని జెన్నీ ఉద్వేగానికి గుర‌యింది.