కోమాలో భర్త.. బతికించుకునేందుకు భార్య ఏం చేసిందో తెలుసా..?
Husband in Coma | ఒకరికొకరం జీవితాంతం తోడు ఉంటామని పెళ్లి సమయంలో పురోహితులు నూతన వధూవరుల చేత ప్రమాణం చేయించడం వినే ఉంటారు. చూసే ఉంటారు. పెళ్లి రోజు చెప్పిన మాట ప్రకారం చాలా మంది భార్యాభర్తలు నడుచుకుంటారు. ఆ విధంగానే ఓ భార్య కూడా కోమాలో ఉన్న భర్తను బతికించేందుకు పడరాని కష్టాలు పడుతోంది. కుడుములు అమ్ముతూ డబ్బు సంపాదించి, భర్త ఆరోగ్యానికి ఖర్చు పెడుతోంది. చైనాలోని జియాంగ్సీ ప్రావిన్స్‌కు చెందిన డింగ్ అనే […]

Husband in Coma | ఒకరికొకరం జీవితాంతం తోడు ఉంటామని పెళ్లి సమయంలో పురోహితులు నూతన వధూవరుల చేత ప్రమాణం చేయించడం వినే ఉంటారు. చూసే ఉంటారు. పెళ్లి రోజు చెప్పిన మాట ప్రకారం చాలా మంది భార్యాభర్తలు నడుచుకుంటారు. ఆ విధంగానే ఓ భార్య కూడా కోమాలో ఉన్న భర్తను బతికించేందుకు పడరాని కష్టాలు పడుతోంది. కుడుములు అమ్ముతూ డబ్బు సంపాదించి, భర్త ఆరోగ్యానికి ఖర్చు పెడుతోంది.
చైనాలోని జియాంగ్సీ ప్రావిన్స్‌కు చెందిన డింగ్ అనే వ్యక్తికి, నీ అనే మహిళకు 2016లో పెళ్లి అయింది. అనంతరం వారు బతికేందుకు నూడిల్స్, కుడుములు అమ్మేన్నారు. అలా వారి వ్యాపారం బాగానే అభివృద్ధి చెందింది. హోం డెలివరీలకు వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో డింగ్ నూడిల్స్, కుడుములను హోం డెలివరీ చేసేందుకు వెళ్లగా, యాక్సిడెంట్‌కు గురయ్యాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమై బ్రెయిన్ దెబ్బతిన్నది. దీంతో కోమాలోకి వెళ్లిపోయాడు డింగ్.
భర్తను బతికించుకునేందుకు సొంతిల్లును అమ్మేసింది నీ. అయినా డబ్బులు సరిపోవడం లేదు. చేసేదేమీ లేక మళ్లీ కుడుముల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక్కతే కుడుములు తయారు చేస్తూ, విక్రయిస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అలా భర్తను బతికించుకునేందుకు రూ. 71 లక్షలు ఖర్చు చేసింది ఇప్పటి వరకు.
ఈ సందర్భంగా నీ మాట్లాడుతూ.. నేను నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త కోసం సంవత్సరం, రెండేండ్లు, మూడేండ్లు అయినా ఆగుతాను. డింగ్ ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. అతను పూర్తిగా కోలుకుంటాడన్న నమ్మకం నాకు ఉందని నీ పేర్కొన్నారు.