ప్రియుడి కోసం కొట్టుకున్న యువ‌తులు (వీడియో వైరల్)

Love Affair | ఓ అమ్మాయి త‌న బాయ్ ఫ్రెండ్‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అత‌నే త‌న జీవితం అనుకొని ఊహ‌ల ప్ర‌పంచంలో తేలియాడుతోంది. ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు ఎప్పుడే వేయాలా? అని క‌ల‌లు కంటోంది. కానీ ఆ ప్రియురాలి క‌ల‌లకు మాత్రం ఓ యువ‌తి అడ్డు ప‌డింది. ఎందుకంటే త‌న ప్రియుడితో ఆమె చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ విష‌యం ప్రియురాలి కంట ప‌డింది. View this post on Instagram […]

ప్రియుడి కోసం కొట్టుకున్న యువ‌తులు (వీడియో వైరల్)

Love Affair | ఓ అమ్మాయి త‌న బాయ్ ఫ్రెండ్‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అత‌నే త‌న జీవితం అనుకొని ఊహ‌ల ప్ర‌పంచంలో తేలియాడుతోంది. ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు ఎప్పుడే వేయాలా? అని క‌ల‌లు కంటోంది.

కానీ ఆ ప్రియురాలి క‌ల‌లకు మాత్రం ఓ యువ‌తి అడ్డు ప‌డింది. ఎందుకంటే త‌న ప్రియుడితో ఆమె చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ విష‌యం ప్రియురాలి కంట ప‌డింది.

ఇంకేముంది న‌డి బ‌జార్లో.. అంద‌రి ముందు ఆ యువ‌తి తాట తీసింది ప్రియురాలు. నా బాయ్ ఫ్రెండే దొరికాడా అంటూ లాగి కొట్టింది. ఆమెకు తోడుగా మ‌రో న‌లుగురు అమ్మాయిలు క‌లిసి ఆ యువ‌తిపై దాడి చేశారు. ఓ వైపు తంతూనే, మ‌రో వైపు జుట్టు ప‌ట్టి లాగారు.

ఏ ఒక్క‌రూ ఆమెను వారి దాడి నుంచి త‌ప్పించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చివ‌ర‌కు ఓ యువ‌కుడు ఆమెను అమ్మాయిల దాడి నుంచి కాపాడాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే ఈ ఘ‌ట‌న బీహార్‌లోని స‌ర‌న్ జిల్లా ప‌రిధిలోని సోనేపూర్ మేళాలో చోటు చేసుకుంది.