రొమాన్స్ సన్నివేశాల్లో ఆడవారే ముందుండాలి: తమన్నా

విధాత: సామాన్యంగా ఇంటిమేట్ సీన్లలో నటించేటప్పుడు హీరోయిన్లకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని చాలామంది భావిస్తారు. రొమాంటిక్ సన్నివేశాలలో, శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు వందలాది మంది యూనిట్ మధ్య.. లైట్ బాయ్స్ నుంచి అందరూ చూస్తుండగా అందరి మధ్య ఇలాంటి సీన్లు చేయడం అంటే అది అంత ఈజీ కాదు. ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కేవలం తాము చేస్తోంది నటన అని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మానసికంగా ప్రిపేర్ అయితే మాత్రమే అలాంటి సీన్స్‌లో బాగా […]

  • By: krs    latest    Dec 30, 2022 6:51 AM IST
రొమాన్స్ సన్నివేశాల్లో ఆడవారే ముందుండాలి: తమన్నా

విధాత: సామాన్యంగా ఇంటిమేట్ సీన్లలో నటించేటప్పుడు హీరోయిన్లకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని చాలామంది భావిస్తారు. రొమాంటిక్ సన్నివేశాలలో, శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు వందలాది మంది యూనిట్ మధ్య.. లైట్ బాయ్స్ నుంచి అందరూ చూస్తుండగా అందరి మధ్య ఇలాంటి సీన్లు చేయడం అంటే అది అంత ఈజీ కాదు. ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కేవలం తాము చేస్తోంది నటన అని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మానసికంగా ప్రిపేర్ అయితే మాత్రమే అలాంటి సీన్స్‌లో బాగా నటించి సరిగ్గా మెప్పించగలరు.

ఉదాహరణకు ఒకనాడు వచ్చిన స్వాతిముత్యం చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో కమలహాసన్, రాధిక హీరోహీరోయిన్లుగా నటించగా కే విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యంగా ఉండే సన్నివేశాలతో ‘మనసు పలికే మౌనగీతం’ అనే సాంగ్ వస్తుంది.

ఇందులో ఎంతసేపటికి వాళ్ళ మధ్య రొమాన్స్ సరిగా పండక పోవడంతో రెండు మూడు టేకులు చూసినా విశ్వనాథ్ ఇక లాభం లేదు అనుకొని రాధికను పిలిచి ఆమె ఒంటిపై సెంట్‌ను స్ప్రే చేశాడట. కానీ ఆ సెంట్‌ కమల్‌కు మూడ్ రావడం కోసం తనకు తానే చేసుకున్నానని కమల్ తప్పుగా అర్థం చేసుకున్నాడు అంటూ ఇటీవల రాధిక చెప్పుకొచ్చింది.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. అటు గ్లామర్ ఇటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అంటూ బాగానే సినిమాలు చేసింది. ఈమె నటించిన చిత్రాలలో బాహుబలిలో వచ్చిన సాంగ్ జనాలకు క‌ల‌కాలం గుర్తుంది పోతుంది. అంతేకాదు రచ్చ సినిమాలో చేసిన గ్యాంగ్ లీడర్ సాంగ్ కూడా అందులో ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే తమన్నా చేసిన ఇంటిమేట్ సీన్స్ చాలా చిత్రాల్లో ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండే తమన్నా ఇప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంటిమేటి సీన్లు ఎలా చేస్తారు? అలాంటి సీన్లు చేసేటప్పుడు నటీనటులకు ఎలాంటి ఫీలింగ్స్ రావా? అనే సందేహం గురించి సాధారణ ప్రేక్షకులకు ఆమె క్లారిటీ ఇచ్చింది. చాలామంది ఇంటిమేట్ సీన్లు చేసేటప్పుడు మగాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారు. వారికి మూడ్ వస్తుందని భావిస్తారు. కానీ అది తప్పు.

నిజానికి చాలా మంది హీరోలు, నా స‌న్నిహితులు కూడా చాలామంది ఇంటిమేట్ సీన్లు చేసేటప్పుడు చాలా సిగ్గు పడిపోయే వారు. మగాళ్లు కూడా చాలా మంది అలాంటి సీన్లు చేసేటప్పుడు సిగ్గు పడతారు. తన కోస్టార్ ఏమనుకుంటుందో అనే ఆలోచన వాళ్లకు ఆ ఫీలింగ్ కలగడానికి కారణం. దానిని పోగొట్టాలంటే హీరోయిన్లు కూడా కాస్త ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.