Women’s T20 WC | అదరగొట్టిన అమ్మాయిలు..! వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
Women's T20 WC | దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతున్నది. కేప్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టెఫానీ టేలర్ 40 బంతుల్లో 42, షైమైన్ కాంప్‌బెల్ 36 బంతుల్లో 30 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి […]

Women’s T20 WC | దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతున్నది. కేప్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టెఫానీ టేలర్ 40 బంతుల్లో 42, షైమైన్ కాంప్‌బెల్ 36 బంతుల్లో 30 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఒక దశలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వరుసగా స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ పెవిలియన్‌కు చేరగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 42 బంతుల్లో 33 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆ తర్వాత రిచా దేవికా వైద్యతో కలిసి భారత్‌ను గెలిపించింది. రిచా 32 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
18న ఇంగ్లాండ్‌తో తలపడనున్న భారత్
ఈ నెల 18న భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. ప్రస్తుతం గ్రూప్-బీలో ఇంగ్లిష్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి.. నాలుగు పాయింట్లో అగ్రస్థానంలో ఉంది. అలాగే భారత్ సైతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. నెట్‌రన్‌రేట్ పరంగా ఇంగ్లాండ్ జట్టు కంటే భారత్ కాస్త వెనకబడింది. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నది. గ్రూప్-బీలో పాక్ మూడోస్థానంలో, వెస్టిండీస్ జట్టు నాలుగో స్థానంలో, ఐర్లాండ్ ఐదో స్థానంలో ఉన్నాయి.
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
వెస్టిండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలు 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. టీ20లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇంతకు ముందు పూనమ్ యాదవ్ 98 వికెట్లు కూల్చింది. దీప్తి ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంది.