భార‌త్‌, చైనా క‌లిస్తే అద్భుత ప్ర‌పంచం: ద‌లైలామా

ఒక‌ప్ప‌టి గురువైన భార‌త్‌కు శిష్యురాలైన టిబెట్ పాఠాలు అహింసా సిద్ధాంతంతో ప్ర‌పంచానికి భార‌త్ నేతృత్వం వ‌హించాలి విధాత‌: ఒక‌ప్పుడు టిబెట్ భార‌త్ నుంచి జ్ఞానం పొందింద‌నీ, ఆ అర్థంలో భార‌త‌దేశం టిబెట్‌కు గురువు లాంటిద‌ని బౌద్ధ గురువు ద‌లైలామా అన్నారు. ఇప్పుడు ప‌రిస్థితి తారుమారై భార‌త్‌కు జ్ఞానం అందించే స్థాన‌లో టిబెట్ ఉన్న‌ద‌ని తెలిపారు. సుదీర్ఘ కాలంగా త‌న‌కు ఆతిథ్య‌మిస్తున్నందుకు భార‌త్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ప్రాచీన కాలంలో భార‌త న‌లందా విశ్వ‌విద్యాల‌యం నుంచి టిబెట్ ఎంతో […]

  • By: krs    latest    Jan 06, 2023 10:57 AM IST
భార‌త్‌, చైనా క‌లిస్తే అద్భుత ప్ర‌పంచం: ద‌లైలామా
  • ఒక‌ప్ప‌టి గురువైన భార‌త్‌కు శిష్యురాలైన టిబెట్ పాఠాలు
  • అహింసా సిద్ధాంతంతో ప్ర‌పంచానికి భార‌త్ నేతృత్వం వ‌హించాలి

విధాత‌: ఒక‌ప్పుడు టిబెట్ భార‌త్ నుంచి జ్ఞానం పొందింద‌నీ, ఆ అర్థంలో భార‌త‌దేశం టిబెట్‌కు గురువు లాంటిద‌ని బౌద్ధ గురువు ద‌లైలామా అన్నారు. ఇప్పుడు ప‌రిస్థితి తారుమారై భార‌త్‌కు జ్ఞానం అందించే స్థాన‌లో టిబెట్ ఉన్న‌ద‌ని తెలిపారు.

సుదీర్ఘ కాలంగా త‌న‌కు ఆతిథ్య‌మిస్తున్నందుకు భార‌త్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ప్రాచీన కాలంలో భార‌త న‌లందా విశ్వ‌విద్యాల‌యం నుంచి టిబెట్ ఎంతో జ్ఞానాన్ని పొందిందని ద‌లైలామా తెలిపారు. ఎంతో మంది టిబెట‌న్ల‌కు భార‌త్ ఆశ్ర‌యం ఇస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్రపంచంలోనే అతి ఎక్కువ జ‌నాభా క‌లిగిన భార‌త్, చైనాలు క‌రుణ‌, ప్రేమ పునాదుల‌పై క‌లిసి ప‌నిచేస్తే.. ప్రంప‌చానికే ముంద‌డుగుగా ఉంటుంద‌ని ద‌లైలామా అన్నారు. సుమారు 250 కోట్ల జ‌నాభా ఈ రెండు దేశాల్లోనే ఉన్న‌ద‌ని, ఈ దేశాలు చేయి చేయి కలిపితే అద్బుత ప్ర‌పంచం ఆవిష్క‌ర‌ణ జ‌రుగుతుంద‌ని అన్నారు. అహింసా సిద్ధాంతంతో ప్ర‌పంచానికి భార‌త్ నాయ‌క‌త్వ పాత్ర వ‌హించాల‌ని కోరారు.