గోవర్ధన గిరిధారిగా లక్ష్మీనరసింహుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం స్వామివారి నిత్యారాధనల అనంతరం గోవర్ధన గిరిధారి అలంకార సేవను శాస్తయుక్తంగా నిర్వహించారు

గోవర్ధన గిరిధారిగా లక్ష్మీనరసింహుడు
  • సింహవాహనంపై ఊరేగింపు


విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం స్వామివారి నిత్యారాధనల అనంతరం గోవర్ధన గిరిధారి అలంకార సేవను శాస్తయుక్తంగా నిర్వహించారు. బృందావన వాసులను, గోవులను రక్షించి ఇంద్రునికి గుణ పాఠం నేర్పేందుకు చిటికెన వేలితో గోవర్ధన పర్వతమున ఎత్తిన స్వామివారు తనను ఆశ్రయించే భక్తులకు సర్వదా రక్షగా ఉంటానంటూ అవతార సందేశమిచ్చారని యాజ్ఞీక, అర్చక పండితులు తెలిపారు. సాయంత్రం స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు.


సింహముఖ రూపుడైన నారసింహుడు శౌర్య, పరాక్రమ స్వరూపమైన సింహవాహనాన్ని అధిష్టించి తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రధానంగా దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తు కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ, అశ్వవాహన సేవ, శ్రీ స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు.