హ‌నుమంత వాహ‌నంపై రామావ‌తార అలంక‌ర‌ణ‌లో యాదాద్రీశుడు..

భ‌క్తి పార‌వశ్యంలో త‌రించిన భ‌క్తులు కళ్యాణానికి ముస్తాబైన లక్ష్మీనరసింహుడు ఏర్పాట్లు పూర్తి చేసిన వేద పండితులు విధాత: యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధాలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. రామావతార అలంకారంలో హనుమంత వాహనంపై విహరించిన లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. సాయంత్రం నిర్వహించనున్న లక్ష్మీ నరసింహుల తిరు కల్యాణోత్సవానికి స్వామి, అమ్మవార్లను వేదపండితులు శోభాయమానంగా ముస్తాబు చేశారు. క్షీర […]

హ‌నుమంత వాహ‌నంపై రామావ‌తార అలంక‌ర‌ణ‌లో యాదాద్రీశుడు..
  • భ‌క్తి పార‌వశ్యంలో త‌రించిన భ‌క్తులు
  • కళ్యాణానికి ముస్తాబైన లక్ష్మీనరసింహుడు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన వేద పండితులు

విధాత: యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధాలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు.

రామావతార అలంకారంలో హనుమంత వాహనంపై విహరించిన లక్ష్మీనరసింహున్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. సాయంత్రం నిర్వహించనున్న లక్ష్మీ నరసింహుల తిరు కల్యాణోత్సవానికి స్వామి, అమ్మవార్లను వేదపండితులు శోభాయమానంగా ముస్తాబు చేశారు.

క్షీర సాగర తనయి లక్ష్మి అమ్మవారిని, సింహముఖ నారాసింహుడి కళ్యాణ ఘట్టాన్ని పాంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం వైభవంగా నిర్వహించేందుకు వేద పండితులు ఆలయ అధికారులు సన్నద్ధమయ్యారు.