సరదాగా మిత్రులతో కలిసి నడుస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి
Viral Video | చావు ఎవర్ని ఎప్పుడు పలుకరిస్తుందో తెలియదు. ఓ యువతి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఘటన మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. వాకింగ్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో డిసెంబర్ 2వ తేదీన రాత్రి 10 గంటల సమయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని అహ్మద్ నగర్‌కు చెందిన ఓ నలుగురు యువకులు శుక్రవారం రాత్రి ఓ వీధిలో నడుచుకుంటూ […]

Viral Video | చావు ఎవర్ని ఎప్పుడు పలుకరిస్తుందో తెలియదు. ఓ యువతి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఘటన మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. వాకింగ్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో డిసెంబర్ 2వ తేదీన రాత్రి 10 గంటల సమయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని అహ్మద్ నగర్‌కు చెందిన ఓ నలుగురు యువకులు శుక్రవారం రాత్రి ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో ఓ యువకుడు నడుస్తూనే కుప్పకూలిపోయాడు. మిగతా ముగ్గురు అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. యువకుడు వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
మితిమీరిన జిమ్ చేయడం, కొవ్వు పెరిగే ఆహారం తినడం, వంశ పారంపర్య లక్షణాలు, మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం గుండెపోటుకు దారి తీస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుండెపోటుకు గురవుతున్న వారిలో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు పూర్తిగా మూసుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది.