టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్‌పై రాళ్ల దాడి
MLA Rasamai Balakishan | కరీంనగర్ జిల్లా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవనం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కొంతమంది యువకులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ దాడులకు పాల్పడ్డ యువకులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. రసమయిని అక్కడ్నుంచి పంపించేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్లు నిర్మించాలని పలు యువజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా […]

MLA Rasamai Balakishan | కరీంనగర్ జిల్లా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవనం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కొంతమంది యువకులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ దాడులకు పాల్పడ్డ యువకులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. రసమయిని అక్కడ్నుంచి పంపించేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్లు నిర్మించాలని పలు యువజన సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. అయితే అదే మార్గంలో రసమయి బాలకిషన్ బెజ్జంకి వెళ్తుండగా, ధర్నా చేపట్టిన యువకులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం ఎమ్మెల్యేను అక్కడ్నుంచి పోలీసులు పంపించేశారు.