You Tube | భార‌త్‌లో 19 ల‌క్ష‌ల వీడియోల‌ను తొల‌గించిన యూట్యూబ్‌.. 9 ల‌క్ష‌ల ఛానెళ్ల నిలిపివేత

You Tube | నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌డ‌మే కార‌ణం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 ల‌క్ష‌ల ఛానెళ్ల నిలిపివేత నూత‌న ఫీచ‌ర్లతో అల‌రించ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న యూట్యూబ్ (You Tube) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ యూట్యూబ‌ర్‌లు అప్‌లోడ్ చేసిన సుమారు 19 ల‌క్ష‌ల వీడియోల‌ను ప్లాట్‌ఫాం నుంచి తొల‌గించిన‌ట్లు వెల్ల‌డించింది. త‌మ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. ఇదే కార‌ణంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 60 ల‌క్ష‌ల‌కు పైగా వీడియోల‌ను యూట్యూబ్ తొల‌గించింది. 2023 జ‌న‌వ‌రి నుంచి […]

  • By: krs    latest    Aug 31, 2023 9:23 AM IST
You Tube | భార‌త్‌లో 19 ల‌క్ష‌ల వీడియోల‌ను తొల‌గించిన యూట్యూబ్‌.. 9 ల‌క్ష‌ల ఛానెళ్ల నిలిపివేత

You Tube |

  • నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌డ‌మే కార‌ణం
  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 ల‌క్ష‌ల ఛానెళ్ల నిలిపివేత

నూత‌న ఫీచ‌ర్లతో అల‌రించ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న యూట్యూబ్ (You Tube) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ యూట్యూబ‌ర్‌లు అప్‌లోడ్ చేసిన సుమారు 19 ల‌క్ష‌ల వీడియోల‌ను ప్లాట్‌ఫాం నుంచి తొల‌గించిన‌ట్లు వెల్ల‌డించింది. త‌మ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. ఇదే కార‌ణంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 60 ల‌క్ష‌ల‌కు పైగా వీడియోల‌ను యూట్యూబ్ తొల‌గించింది.

2023 జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు ఈ తొల‌గింపు ప్ర‌క్రియ జ‌రిగింది. వీడియోల‌నే కాకుండా ఛానెళ్ల వారీ గానూ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనుస‌రించ‌ని వాటిని ర‌ద్దు చేసింది. వీటి సంఖ్య మొత్తంగా సుమారు 9 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని తెలుస్తోంది. స్పామ్ పాల‌సీల‌ను అతిక్ర‌మించ‌డం, ఆర్థిక మోసాల‌కు పాల్ప‌డ‌టం, డేటా దుర్వినియోగం, థంబ్‌నైల్స్‌తో ప‌క్క‌దారి ప‌ట్టించ‌డం, కామెంట్లను నియంత్రించ లేక‌పోవ‌డం మొద‌లైన అంశాల‌ను ఈ తొల‌గింపున‌కు ప్రామాణికంగా తీసుకున్నారు.

యాప్‌ల ద్వారా, స్పామ్ సైట్ల ద్వారా చేసిన ప్ర‌మోష‌నల్ కామెంట్ల‌ను కూడా యూట్యూబ్ తొల‌గించింది. వీటి సంఖ్య దాదాపు 80 కోట్లుగా ఉంది. మేము ఎంతో శ్ర‌మ‌ప‌డి యూట్యూబ్ నిబంధ‌న‌లను అనుస‌రించాం. వాటిని ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించేలా చేయ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేశాం. 99 శాతం మంది యూట్యూబ‌ర్లు అన్ని నిబంధ‌న‌ల‌నూ పాటిస్తున్నారు. మిగిలిన కొద్ది మందిని తొల‌గించ‌డానికి ఈ డ్రైవ్ ను చేప‌ట్టాం అని యూట్యూబ్ త‌న అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఇందులో ఎలాంటి శ‌ష‌భిష‌ల‌కు తావులేకుండా ప్ర‌య‌త్నించామ‌ని.. 93 శాతం వీడియోల‌ను కృత్రిమ మేధ‌నే తొల‌గించింద‌ని.. మాన‌వ ప్ర‌మేయానికి చాలా త‌క్కువ చోటుంద‌ని స్ప‌ష్టం చేసింది. సుమారు 69 శాతం వీడియోల‌కు తాము తొల‌గించే స‌మ‌యానికి 10 వీక్ష‌ణ‌ల క‌న్నా త‌క్కువే వ‌చ్చాయ‌ని, 38 శాతం వీడియోలకు అస‌లు ఒక్క వ్యూ కూడా రాలేద‌ని పేర్కొంది.

2019 నుంచి యూట్యూబ్ అనుస‌రిస్తున్న విధానం ప్ర‌కారం.. ఎవ‌రైనా క్రియేట‌ర్ నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తున్న‌ట్లు గుర్తిస్తే వారికి తొలి హెచ్చ‌రిక‌గా మెసేజ్ పంపుతున్నారు. దీంతో చాలా మంది నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే క్రియేట్‌ను పోస్ట్ చేయ‌డం, ప్ర‌చారం చేయ‌డం చేస్తున్నారు. అంతే కాకుండా ఎడ్యుకేష‌న‌ల్ ట్రైనింగ్ కోర్సెస్ పేరుతో క్రియేట‌ర్ల‌కు త‌మ నియ‌మ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌నా త‌ర‌గ‌తులు కూడా యూట్యూబ్ నిర్వ‌హిస్తోంది.