Brain Health | 40 ఏళ్ల తర్వాత కూడా బ్రెయిన్ యంగ్ గా ఉండాలంటే..
ప్రతిరోజూ ఉదయాన్నే మెదడుకు పని పెట్టండి. కనీసం ఓ పది నిమిషాల పాటైనా ఏవైనా పజిల్స్ (puzzles) సాల్వ్ చేయండి. క్రాస్ వర్డ్స్, సుడోకు (Sudoku), వర్డ్ గేమ్స్ (crosswords) లాంటివి మెమరీ పవర్ ని పెంచుతాయి. ఏకాగ్రత, కాగ్నటివ్ సామర్థ్యాలు మెరుగుపడతాయి.

Brain health | ప్రతిరోజూ ఉదయాన్నే మెదడుకు పని పెట్టండి. కనీసం ఓ పది నిమిషాల పాటైనా ఏవైనా పజిల్స్ (puzzles) సాల్వ్ చేయండి. క్రాస్ వర్డ్స్, సుడోకు (Sudoku), వర్డ్ గేమ్స్ (crosswords) లాంటివి మెమరీ పవర్ ని పెంచుతాయి. ఏకాగ్రత, కాగ్నటివ్ సామర్థ్యాలు మెరుగుపడతాయి.
- నాన్ డామినెంట్ హ్యాండ్ ని రోజూ కొద్దిసేపు ఉపయోగించండి. మీరు కుడి చేతివాటం ఉన్న వాళ్లయితే ఎడమ చేతినీ, అదేవిధంగా ఎడమ చేతివాటం ఉన్నవాళ్లయితే కుడి చేతిని ఉపయోగించి పనులు చేయండి. బ్రష్ చేయడం, వంట చేసేటప్పుడు ఫుడ్ ని కలపడానికి ఇలా నాన్ డామినెంట్ హ్యాండ్ ని వాడండి. దీనివల్ల నరాల మధ్య అనుసంధానం (న్యూరాల్ కనెక్షన్స్) పెరుగుతుంది. తద్వారా బ్రెయిన్ యాక్టివిటీ బెటర్ అవుతుంది.
- ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు నడవండి. వాకింగ్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వయసుతో పాటు కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గే రిస్కు నుంచి వాకింగ్ కాపాడుతుంది.
- కొత్త మ్యూజిక్ గానీ, పాడ్ కాస్ట్ గానీ వింటూ ఉండండి. అప్పటివరకూ వినని కొత్త శబ్దాలను వినడం వల్ల కాగ్నిటివ్ స్కిల్స్ పెరగడమే కాకుండా మెమరీ పవర్ బాగుపడుతుంది.
- కంప్యూటర్ లో టైప్ చేయడానికి బదులుగా పెన్నుతో రాయండి. చేతితో రాయడం ద్వారా మెమరీ, భావోద్వేగాలకు సంబంధించిన స్థానాలు యాక్టివేట్ అవుతాయి.
- రోజూ ఓ 5 నిమిషాల పాటైనా మైండ్ ఫుల్ మెడిటేషన్ చేయండి. మైండ్ ఫుల్ నెస్ వల్ల బ్రెయిన్ ఫాగ్, స్ట్రెస్ తగ్గుతాయి. గ్రే మ్యాటర్ సాంద్రత పెరిగి ఏకాగ్రత కుదురుతుంది.
- కొత్త పదాలు, కొత్త భాషలు నేర్చుకోవడం ద్వారా వర్బల్ ఫ్లూయెన్సీ పెరగడమే కాకుండా కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. తద్వారా కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గకుండా ఉంటుంది.
- చెస్, మెమొరీ కార్డ్ గేమింగ్ లాంటివి ఆడటం వల్ల ఏకాగ్రత, ప్లానింగ్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడతాయి.
ఇవి కూడా చదవండి..
Health Tips | హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ అలవాట్లు మెరుగైన ఆరోగ్యానికి దివ్యౌషదం..! అవేంటో తెలుసుకోండి మరి..!
Kidney Health: కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ టిప్స్ పాటించండి
Health tips | రాత్రంతా ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగండి.. ఫలితం మామూలుగా ఉండదుగా..!
Health tips | వర్షాకాలం అలర్జీలా.. ఈ చిట్కాలతో నయం చేసుకోండి..!