social rejection । అయ్యో దేవుడా.. ఇంతందం ఎందుకిచ్చావయ్యా..!! బ్రెజిల్‌ మోడల్‌కు అందాల కష్టాలు!

సన్నగా, అందంగా కనిపిస్తున్నందుకు తనను ఒక బ్రైడల్‌ పార్టీ నుంచి పంపించేశారని బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌ వాపోయింది.

social rejection । అయ్యో దేవుడా.. ఇంతందం ఎందుకిచ్చావయ్యా..!! బ్రెజిల్‌ మోడల్‌కు అందాల కష్టాలు!

social rejection । బ్రెజిల్‌కు చెందిన సావో పాలోకు చెందిన ఒక మోడల్‌కు ఆమె అందాలే కష్టాలు తెచ్చిపెట్టాయట! దీంతో అయ్యో దేవుడా.. ఎందుకయ్యా ఇంత అందాన్నిచ్చావ్‌.. అంటూ మన తెలుగు సినీ హీరోయిన్‌ త్రిషలా అందంగా తలపట్టుకుంటున్నది! ఆమె మిస్‌ బంబం విజేత కూడా! ఇంతకీ ఆమెకు ఆమె అందం ఎందుకు కష్టాన్ని తెచ్చిపెట్టిందనే కదా మీ డౌటు? మరీనా స్మిత్‌ అనే 34 ఏళ్ల ఈ మోడల్‌.. తన స్నేహితురాళ్లతో కలిసి ఒక క్రిస్మస్‌ డిన్నర్‌కు హాజరైందట.

అయితే.. ఆమె ఆ డిన్నర్‌కు వచ్చిన ఆమె స్నేహితురాళ్లు.. ఆ డిన్నర్‌ నుంచి వెళ్లగొట్టారట. ఎందుకంటే.. మరీనా తయారై వచ్చిన తీరు చూసి.. ‘ఇంత మరీనా?’ అని వాళ్లు తెగ ఇదైపోయారట! తమతో వచ్చిన భర్తలు, తమ బాయ్‌ఫ్రెండ్స్‌ ఎక్కడ చూపులను ఆమెకు గుచ్చేస్తారో, ఆమె వెంటపడి ఎక్కడ వెళ్లిపోతారోనని భయపడి.. ఆ డిన్నర్‌ నుంచి వెళ్లగొట్టారట. ఈ విషయాన్ని ఆమె తన సామాజిక మాధ్యమం ఖాతాలో వెళ్లబోసుకున్నది. తాను తన స్నేహితుల భాగస్వాములతో ఎప్పుడూ చనువుగా ప్రవర్తించలేదని బంబం టైటిల్‌ విన్నర్‌ అయిన మరీనా చెప్పుకొంటున్నది. ‘బావుండాలని మంచి డ్రెస్‌ వేసుకున్నాను. సమస్య నాతో లేదు. వాళ్లలోని అభద్రత వల్లే మంచి ఫ్రెండ్‌ను దూరం చేసుకున్నారు’ అని రాసుకొచ్చింది. తాను సింగిల్‌ కనుక తన పరిమితిల్లో తాను ఉంటానని, బయట పార్టీలకు తన స్నేహితురాళ్లు జంటలుగా వస్తారని తాను పెద్దగా బయటకు వెళ్లనని ఆమె వాపోయింది.

ఇదే తరహాలో తనను ఒక స్నేహితురాలి బ్రైడల్‌ పార్టీ నుంచి తప్పించారని సాబ్రినా లో అనే 23 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పేర్కొన్నది. అందరూ నీవైపు అట్రాక్ట్‌ అవుతారేమోనని ఆ పెళ్లికూతురు తనతో అన్నదని ఆమె ది న్యూ పోస్ట్‌కు చెప్పింది. ఆమెతో ఇంకా అక్కడే ఉండటం నాకు మంచిగా అనిపించలేదని తెలిపింది. తాను లేని ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ తనను బయటకు పంపడం గురించి చర్చ జరిగిందని వరుడు తనకు చెప్పాడని పేర్కొన్నది. కేవలం ఎలా కనిపిస్తున్నామన్న విషయంలో ఇలా చేయడం తగదని ఫ్లారిడాకు చెందిన 29 ఏళ్ల షెయీ లీ వ్యాఖ్యానించింది. జనాలు భిన్నంగా స్పందిస్తూ ఉంటారు. మీరు చేసే పని ఆధారంగా మీ మీద ఒక అభిప్రాయానికి రారు.. మీరు ఎలా కనిపిస్తున్నారన్న దాని బట్టే ఒక అభిప్రాయం ఏర్పర్చుకుంటారు’ అని పేర్కొన్నది.