ఆపిల్ లవర్స్‌కు మరో గుడ్‌న్యూస్..! ప్రో 2 ఎయిర్‌పాడ్స్‌పై క్రేజీ ఆఫర్స్..!

విధాత: భారత్‌లో పండగల సీజన్ కావడంతో ఈ కామర్స్ సైతం భారీ ఆఫర్లను ప్రకటించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొబైల్, టీవీలతో పాటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, పలు రకాల ఉత్పత్తులపై క్రేజీ ఆఫర్స్‌ను ప్రకటించారు. అమెజాన్ గ్రేట్ ఇండియాన్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ 8న మొదలయ్యాయి. కంపెనీలు ఆపిల్ ఉత్పత్తులపై పోటాపోటీగా డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. యాపిల్ఎయిర్పాడ్స్ ప్రో సెకెండ్ జెన్‌పై మంచి ఆఫర్స్‌ను ప్రకటించారు.
ఆపిల్ వెబ్సైట్లో ఎయిర్‌పాడ్స్ ప్రో 2 రూ.24,900 ఉండగా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఈ ఇయర్‌పాడ్స్‌ను ఆఫర్‌పై రూ.18,499కే ఇస్తున్నాయి. పలు బ్యాంక్‌ల కార్డులపై మరికొన్ని ఆఫర్స్ సైతం ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్ రూ.16,999 వస్తుండగా.. అమెజాన్‌లో రూ.16,749 సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోని 2022లో లాంచ్ చేసింది.
సెకెండ్ జనరేషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన వాండర్లస్ట్ ఈవెంట్లో రిలీజ్ చేసింది. ఇయర్‌ఫోన్స్‌లో లాస్‌లెస్ ఆడియో విత్ అల్ట్రా-లో లేటేన్సీ వస్తుండగా.. ఇందులో హెచ్2 చిప్సెట్ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రోలో సైతం ఇదే చిప్సెట్ ఉండనున్నది.
ఈ రెండిటినీ కలిపి వాడితే క్రేజీ ఫీల్ వస్తుందని, పవర్ఫుల్ 20 బిట్, 48 కేహెచ్‌జెడ్ లాస్‌లెస్ ఆడియో అన్‌లాక్ అవుతుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఐఫోన్ 15 సిరీస్ యూఎస్‌బీ – టైప్ సీ ఇస్తుండగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోను సైతం టైప్ సీతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ ఐపీ54 రేటింగ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తున్నది. మరో వైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12 నుంచి 14 సిరీస్ మొబైల్స్‌పై క్రేజీ ఆఫర్స్‌ను ఇస్తున్నాయి.