Royal Enfield Bullet | ‘బుల్లెట్’ బండిపై దూసుకెళ్లిన వృద్ధ దంపతులు.. నెటిజన్లు ఫిదా
Royal Enfield Bullet | వారు చూడడానికి వృద్ధ దంపతులే( Elderly Couple ).. కానీ పెళ్లైన కొత్త జంట( Newly Wed Couple ) మాదిరి గాల్లో విహారించారు. బుల్లెట్ బండి( Bullet Bike )పై దూసుకెళ్తూ.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. వృద్ధ దంపతుల బుల్లెట్ రైడింగ్( Royal Enfield Bullet )కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Royal Enfield Bullet | వయసులో ఉన్న యువతీయువలకు బుల్లెట్ బండి( Bullet Bike ) అంటే ఓ మోజు.. ఆ బుల్లెట్‌పై అలా దూసుకెళ్తూ.. గాల్లో విహారిస్తూ.. ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ మాదిరి చాలా మంది ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఓ వృద్ధ దంపతులు( Elderly Couple ) కూడా అలా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్( Royal Enfield Bullet )పై దూసుకెళ్తూ.. గాల్లో విహారించారు.
దాదాపు 60 ఏండ్లకు పైబడిన వృద్ధ దంపతులిద్దరూ.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్( Royal Enfield Bullet )పై దూసుకెళ్లారు. ఆ దంపతులు బుల్లెట్‌పై దూసుకెళ్లిన తీరు.. వాహనదారులను, ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంది. వారు ప్రయాణిస్తున్న ఆ బైక్‌పై టైటానిక్( Titanic ) అని రాసి ఉంది.
అయితే వారి రైడింగ్‌కు ఫిదా అయిన వాహనదారులు… అమేజింగ్ అంటూ కితాబిచ్చారు. దీంతో బుల్లెట్ నడుపుతున్న తాత.. చిరునవ్వు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దృశ్యం మహారాష్ట్ర( Maharashtra ) లోని ఓ రహదారిపై కనిపించింది. బుల్లెట్ బండి నంబర్ ప్లేట్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో కూడి ఉంది.
View this post on Instagram