Ink Mark | ఓటేయగానే వేలిపై సిరా చుక్క.. ఈ ఇంక్‌ మార్క్‌ గురించి మీకు ఎంత తెలుసు..?

Ink Mark | ఎన్నిక ఏదైనా సరే ఓటేయగానే పోలింగ్‌ సిబ్బంది మన వేలిపై సిరాచుక్క (Ink Mark) పెడుతారు. ఓటు వేసిన వాళ్లే మళ్లీ ఓటు వేయకుండా ఉండటం కోసం ఈ పద్ధతిని తీసుకొచ్చారు. ఓటు వేసి పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి రాగానే చూపుడు వేలిపై ఉన్న సిరా చుక్కను చూపించడం ఇప్పుటి ట్రెండ్‌గా మారింది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ ట్రెండ్‌ ఫాలో కాని వాళ్లే లేరంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇంక్‌ మార్క్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ink Mark | ఓటేయగానే వేలిపై సిరా చుక్క.. ఈ ఇంక్‌ మార్క్‌ గురించి మీకు ఎంత తెలుసు..?

Ink Mark : ఎన్నిక ఏదైనా సరే ఓటేయగానే పోలింగ్‌ సిబ్బంది మన వేలిపై సిరాచుక్క (Ink Mark) పెడుతారు. ఓటు వేసిన వాళ్లే మళ్లీ ఓటు వేయకుండా ఉండటం కోసం ఈ పద్ధతిని తీసుకొచ్చారు. ఓటు వేసి పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి రాగానే చూపుడు వేలిపై ఉన్న సిరా చుక్కను చూపించడం ఇప్పుటి ట్రెండ్‌గా మారింది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ ట్రెండ్‌ ఫాలో కాని వాళ్లే లేరంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇంక్‌ మార్క్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పత్యేకతలు

  • మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి ఈ సిరా చుక్క వాడకం మొదలైంది. అంతకుముందు 1952, 1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ ఇంక్‌ మార్క్‌ సంప్రదాయం లేదు.
  • 1962లో తొలిసారి వినియోగించినప్పటి నుంచి ఇప్పటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన మైసూర్‌ పెయింట్సే దీన్ని తయారు చేస్తున్నది. ఈ కంపెనీ కేవలం మన దేశంలోనే కాదు, 30కి పైగా దేశాలకు ఈ ఇంకును సప్లయ్‌ చేస్తున్నది. ఎగుమతి చేస్తున్న
  • ఓటేసినట్లు గుర్తించేందుకు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఈ సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని మరో వేలిపైన, అసలు ఎడమ చెయ్యే లేకపోతే కుడిచేతి వేళ్లలో దేనికైనా ఈ ఇంక్‌ మార్క్‌ వేస్తారు. ఒకవేళ రెండు చేతులు లేకుంటే.. ఎడమ లేదా కుడి చేతి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ నియమావళి చెబుతోంది.
  • సిరా చుక్కలో సిల్వర్‌ నైట్రేట్‌ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. అదే గోరుపైన మాత్రం కొన్ని వారాలపాటు చెరిగిపోదు.
  • ఈ సిరా 5.1 మిల్లీలీటర్ల సీసాల్లో ఉంటుంది. ఒక సీసా ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లను ఆర్డర్‌ చేసింది.
  • సాధారణంగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా ఎక్కడైనా వినియోగించేందుకు వీలులేదు. అయితే ఒక్కసారి మాత్రం ఎన్నికల సంఘం ఇతర అవసరానికి ఈ ఇంకును వాడే అవకాశం కల్పించింది. కరోనా సమయంలో కొవిడ్‌ బారినపడి క్వారెంటైన్‌లో ఉన్న వారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఎన్నికల ఇంకును ఉపయోగించాయి.