Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో అద్దిరిపోయే వీడియోలు.. హాలీవుడ్ సినిమాను మించిపోయాయిగా!

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్! పహల్గామ్‌లో ఉగ్రవాద కిరాతక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేప్టటిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్. ఇందులో భారత ఆర్మీ, వైమానిక దళం ప్రధానంగా వ్యవహరించాయి. పాకిస్తాన్‌లోని, ఆక్రమిత కశ్మీర్‌లోని 9 అత్యంత కీలకమైన ఉగ్రవాద శిబిరాలను కూల్చివేశాయి. వందమందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. తదనంతరం పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతూ దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన క్రోడీకరించిన వీడియోను భారత వాయుసేన మంగళవారం విడుదల చేసింది. గులాల్ సినిమాలోని ఆరంభ్ హై.. ప్రచండ్ హై అనే శక్తిమంతమైన మ్యూజిక్ ట్రాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. భారత వాయుసే ఈ ఆపరేషన్‌కు ఎలా సిద్ధపడింది.. ఎలా దాడులు చేసిందనే విషయాలను చూపారు.
ఎల్లప్పుడూ సంకల్పంతో స్పందన.. మునుపెన్నడూ చూడని.. ఎవరూ అడ్డుకోలేని, ఎవ్వరితోనూ సరితూగని యుద్ధ సామర్థ్యాలు.. అని క్యాప్షన్స్ వస్తుంటాయి. తమ లక్ష్యాలను ఎంత సూటిగా అవి ఛేదించాయో, పాక్ దాడులను ఎలా సమర్ధంగా మన రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయో అందులో కళ్లకు కట్టినట్టు చూపారు. మన సైన్యం పోరాట పటిమను ఆ వీడియోలు చాటుతున్నాయి. వేగవంతమైన, ప్రాణాంతకమైన, చురుకైన అందులోనూ లక్ష్యాలను సూటిగా తాకగల.. అంటూ వాయుసేన సమర్థతను చాటాయి. ‘కీర్తితో గగనాన్ని తాకడం’ అనే క్యాప్షన్‌తో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోలో చూపిన దృశ్యాలు మే 6, 7వ తేదీల మధ్య రాత్రి చేసిన దాడులకు సంబంధించినవి. ఈ దాడుల్లో ముఖ్యమైన ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తాయిబా శిబిరాలు సైతం నేలమట్టమయ్యాయి. వాటికి ప్రతిగా పాకిస్తాన్ మన దేశంలోకి క్షిపణులను ప్రయోగించగా.. మన రక్షణ వ్యవస్థలు వాటిని తుత్తనియలు చేశాయి.
ఇదీ ఆ వీడియో..
#IndianAirForce@PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD @HQ_IDS_India @adgpi @indiannavy@IndiannavyMedia @PIB_India @MIB_India pic.twitter.com/xXnycOOXva
— Indian Air Force (@IAF_MCC) May 20, 2025
ఇవి కూడా చదవండి..
hilarious viral video | మందుకొట్టేందుకన్నట్టు వైన్‌షాప్‌లోకి పాము! తొక్కలో ప్రాణం.. బాటిలే ముఖ్యం! (వీడియో)
Kaleshwaram Commission: బిగ్ షాక్..కేసీఆర్, హరీష్, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
Lady Finger | మీరు షుగర్‌తో బాధపడుతున్నారా..? బెండకాయతో తగ్గించుకోండిలా..!