New Life To Pak Teen | పాక్‌ యువతికి కొత్త జీవితం.. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసిన భారత వైద్యులు..

New Lift To Pak Teen | ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాకిస్థానీ యువతికి భారత వైద్యులు ప్రాణదానం చేశారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఐశ్వర్యన్‌ ట్రస్టు సహకారంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. పాక్‌కు చెందిన అయేషా రషన్‌ (19) గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నది. ఇటీవల ఆమె పరిస్థితి మరింత దిగజారింది.

New Life To Pak Teen | పాక్‌ యువతికి కొత్త జీవితం.. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసిన భారత వైద్యులు..

New Life To Pak Teen | ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాకిస్థానీ యువతికి భారత వైద్యులు ప్రాణదానం చేశారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఐశ్వర్యన్‌ ట్రస్టు సహకారంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. పాక్‌కు చెందిన అయేషా రషన్‌ (19) గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నది. ఇటీవల ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చివరకు వైద్యులు ఆమెను ఎక్మోపై ఉంచి చికిత్స నిర్వహించారు. గుండెపంప్‌లోని వాల్వ్‌లో లీక్‌ ఏర్పడింది. దాంతో గుండె మార్పిడి చికిత్స తప్పనిసరి అయ్యింది. ఈ ఆపరేషన్‌కు అయిన ఖర్చు రూ.35లక్షలు ఐశ్యర్యన్‌ ట్రస్ట్‌ భరించింది. పాక్‌ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నైకి చేరుకున్న యువతికి ఆపరేసన్‌ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

సాధారణంగా అవయవదానానికి సంబంధించి విదేశీయులకు రెండో ప్రాధాన్యం ఉంటుంది. అయినా అయేషాకు మాత్రం సులభంగానే గుండె లభించిందని ఇన్‌స్టిట్యూస్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్ డాక్టర్‌ బాలకృష్ణన్, కో డైరెక్టర్ డాక్టర్‌ సురేష్‌రావు తెలిపారు. అయేషా విషయంలో గుండె కోసం మరెవరూ క్లెయిమ్ చేసుకోలేదని చెప్పారు. అవయవదానం, ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్స్‌లో చెన్నై ముందున్న విషయం ఈ ఆపరేషన్‌తో మరోసారి స్పష్టమైందని వైద్యులు పేర్కొన్నారు. దశాబ్దాల పాటు ప్రభుత్వాల కృషితో అవయవదానంలో తమిళనాడు ముందున్నది. అవయవదానం, ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లకు మరింత అనుకూలమైన విధివిధానాలను రూపొందించాలని వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్‌ల ఖర్చులు భరించలేనంతగా ఉండడంతో అనేక రాష్ట్రాల్లో సద్వినియోగం కావాల్సిన అవయవాలు వృథాగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయేషా కుటుంబీకులు ట్రస్టుతో పాటు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.