మహారాష్ట్ర గ్రామాల్లో చిరుత సంచారం
మహారాష్ట్ర గ్రామాల్లో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ గ్రామంలో చిరుతపులి సీసీటీవీ కెమెరాలో కనిపించింది.

- ప్రైవేట్ విద్యుత్తు సంస్థ ఆవరణలోని సీసీటీవీ
- కెమెరాలో రికార్డయిన చిరుతపులి సంచారం
- అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు
విధాత: మహారాష్ట్ర గ్రామాల్లో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ గ్రామంలో చిరుతపులి సీసీటీవీ కెమెరాలో కనిపించింది. దీంతో చిరుత కోసం వెతుకులాట ప్రారంభించామని అటవీశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.
బుధవారం, గురువారం మధ్య రాత్రి కళ్యాణ్-ముర్బాద్ రహదారిలోని కంబ-వరప్ గ్రామం వద్ద ఒక ప్రైవేట్ విద్యుత్ సంస్థ ఆవరణలో చిరుతపులి సంచారం క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరాలో రికార్డయినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
చిరుతపులి కోసం గురువారం ఉదయం 6 గంటల వరకు గాలించినా దాని జాడ తెలియలేదని వెల్లడించారు. చిరుతపులి సంచారం నేపథ్యంలో జంబుల్, అంబర్నాథ్, నలింబి, రైతే, కంబ, పాతర్పాడ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కళ్యాణ్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రఘునాథ్ చన్నేవిజ్ఞప్తి చేశారు.