West Bengal Results | బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు ఎదురుదెబ్బ.. మమతకే మళ్లీ పట్టం
West Bengal Results | పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకే భారీగా మద్దతు తెలిపారు ఆ రాష్ట్ర ప్రజలు.

West Bengal Results | కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకే భారీగా మద్దతు తెలిపారు ఆ రాష్ట్ర ప్రజలు. 42 లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కానీ ఆ ఫలితాలు తలకిందులు అయ్యాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ 31 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్‌లో ఉంది.
2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2024 ఎన్నికల్లో మమతా బెనర్జీ తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బెంగాల్ వ్యాప్తంగా 150 ర్యాలీలు నిర్వహించారు. కోల్‌కతా వీధుల్లో, అర్బన్ ఏరియాలో ఆమె పాదయాత్రలు నిర్వహించి ప్రజల మనసు గెలుచుకున్నారు.
బెంగాల్లో బీజేపీనే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ 26 -31 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడైంది. టీఎంసీ 11 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడైంది.