Nita Ambani | చిన్న కోడలికి నీతా అంబానీ భారీ పెళ్లి కానుక.. 640 కోట్ల విల్లా

చిన్న కోడలికి నీతా అంబానీ అందించబోతున్న పెళ్లి కానుక వైరల్‌గా మారింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్‌ నీతా అంబానీ దుబాయ్‌లోని రూ. 640 కోట్ల విల్లాను కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు గిఫ్టుగా అందించనున్నారు

Nita Ambani | చిన్న కోడలికి నీతా అంబానీ భారీ పెళ్లి కానుక.. 640 కోట్ల విల్లా

విధాత, హైదరాబాద్: చిన్న కోడలికి నీతా అంబానీ అందించబోతున్న పెళ్లి కానుక వైరల్‌గా మారింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్‌ నీతా అంబానీ దుబాయ్‌లోని రూ. 640 కోట్ల విల్లాను కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు గిఫ్టుగా అందించనున్నారు.ఈ విల్లాలో 10 విలాసవంతమైన బెడ్రూమ్‌లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అబ్బురపరిచే కళాకృతులతో ఇంద్రభవనం తలపించేలా ఉందంటున్నారు. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుందట. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి రానున్న జులై 12న ముంబైలో జరుగనుంది. పెళ్లికి చాలా రోజుల ముందు నుంచే హడావుడి మొదలైంది. గతేడాది జనవరిలో నిశ్చితార్థం జరగ్గా.. తరచుగా పలు కార్యక్రమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు మార్చి 1-3 మధ్య ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని గుజరాత్ జామ్‌నగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించారు. ఇక అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్లిని అంబానీ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ఖర్చుతో ఏకంగా 120మిలియన్ డాలర్లకు పైగా అంటే 1000కోట్లకుపైగా ఖర్చు చేయబోతుందని ప్రచారం సాగుతుంది.