Driving License New Rules | డ్రైవింగ్ టెస్ట్‌కు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు..! డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ తెలుసా..?
Driving License New Rules | వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్‌లో కీలక మార్పులు చేసింది. మారిన రూల్స్ జూన్ ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం రవాణాశాఖ కార్యాలయం, ఆర్టీవో వద్ద డ్రైవింగ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25వేల వరకు జరిమానా చెల్లించాల్సి రానున్నది.

Driving License New Rules | వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్‌లో కీలక మార్పులు చేసింది. మారిన రూల్స్ జూన్ ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం రవాణాశాఖ కార్యాలయం, ఆర్టీవో వద్ద డ్రైవింగ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25వేల వరకు జరిమానా చెల్లించాల్సి రానున్నది. జూన్ ఒకటో తేదీ నుంచి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్లోనూ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించుకునేందుకు అవకాశం ఉన్నది.
ఈ సంస్థలకు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయనున్నది. ఇందు కోసం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. డ్రైవింగ్ పాఠశాలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ వాహనాల శిక్షణ కోసం రెండెకరాల భూమి ఉండాల్సి ఉంటుంది. ట్రైనర్లకు తప్పనిసరిగా హైస్కూల్ డిప్లొమా, తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే, కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాల్సి ఉంటుంది. బయోమెట్రిక్, ఐటీ సిసమ్ట్ సైతం అవగాహన ఉండాలి. తేలికపాటి వాహనాలకు నాలుగువారాల్లో 29 గంటలు శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటలు థియరీ, మిగతా 21 గంటలు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు.
భారీ వాహనాలకు ఆరువారాల్లో 38 గంటలు శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటలు థియరీ, 30 గంటలు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇదిలా ఉండగా.. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా 9లక్షల పాత ప్రభుత్వ వాహనాలను దశలవారీగా రద్దు చేయడంతో పాటు ఉద్గారాలపై కఠిన నిబంధనలను అమలు చేయనున్నది. ఇక జరిమానాలను సైతం డబుల్ చేయనున్నారు. వాహనాలు పరిమితికి మించి వేగంగా నడిపితే రూ.1000 నుంచి రూ.2వేల వరకు విధించనున్నారు. మైనర్ వేగంగా వాహనంతో నడుపుతూ పట్టుబడితే రూ.25వేల జరిమానా విధించబోతున్నారు.
అదే సమయంలో వాహన రిజిస్ట్రేషన్‌ను సైతం రద్దు చేస్తారు. ఆ మైనర్ 25 సంవత్సరాల వయసు వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు. లైసెన్స్ లేకుండా వెహికిల్ నడిపితే రూ.500, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.100, సీటు బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ.100 చొప్పున జరిమానా విధిస్తారు. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ప్రక్రియ గతంలో మాదిరిగానే కొనసాగుతుంది. దరఖాస్తుదారులు parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అయితే, గతంతో పోలిస్తే కేంద్రం దరఖాస్తు ప్రక్రియను కాస్త సులభతరం చేసింది.