ఒడిశా ముఖ్య‌మంత్రిగా … మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ

ఒడిశా ముఖ్య‌మంత్రిగా మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ పేరును బీజేపీ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. క‌న‌వ‌ర్ధ‌న్ సింగ్ దేవ్, ప్ర‌వ‌తి ప‌రిదా డిప్యూటీ సీఎంలుగా కొన‌సాగ‌నున్నారు.

ఒడిశా ముఖ్య‌మంత్రిగా … మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశా ముఖ్య‌మంత్రిగా మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ పేరును బీజేపీ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. కనక్‌ వర్ధన్‌ సింగ్‌ డియో, ప్రవటి పరిదా,  డిప్యూటీ సీఎంలుగా కొన‌సాగ‌నున్నారు. ఒడిశా సీఎం, డిప్యూటీ సీఎంలుగా మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ , ప్రవటి పరిదా,  ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు హాజ‌రు కానున్నారు. మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ కియోంజ‌ర్ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

ఒడిశాలో 24 ఏండ్ల న‌వీన్ ప‌ట్నాయ‌క్ పాల‌న‌కు బీజేపీ బ్రేకులు వేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజూ జ‌న‌తా ద‌ళ్ పార్టీ ఓట‌మి పాలైంది. 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కైవ‌సం చేసుకుంది. బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఐ(ఎం) 1, ఇత‌రులు మూడు స్థానాల్లో గెలుపొందారు.

కనక్‌ వర్ధన్‌ సింగ్‌ ప్రవటి పరిదా