Pune | ప్రమాదానికి కారణమైన మైనర్ తండ్రి అరెస్టు
పూనె-పోర్షే కారు నడిపి ఇద్దరి మృతికి కారకుడైన మైనర్‌కు రోడ్డు నియమాలపై వ్యాసరచన చేయాలని సోమవారం కోర్టు ఆదేశించగా తాజాగా పోలీసులు ఆ మైనర్ తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు

పూనె-పోర్షే కారు నడిపి ఇద్దరి మృతికి కారకుడైన మైనర్‌కు రోడ్డు నియమాలపై వ్యాసరచన చేయాలని సోమవారం కోర్టు ఆదేశించగా తాజాగా పోలీసులు ఆ మైనర్ తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. పదిహేడేళ్ల మైనర్ తండ్రి ఒక పెద్ద బిల్డర్. ఆయనను ఔరంగాబాద్‌లో అరెస్టు చేసి పూనె తీసుకువచ్చినట్టు పోలీసు అధికారి చెప్పారు.
మైనర్‌కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైనందుకు జువెనైల్ జస్టిస్ యాక్ట్, మోటార్ వెహికిల్ యాక్ట్‌ల కింద తండ్రిని అరెస్టు చేశారు. తన మైనర్ తనయుని కోసం గత మార్చిలో తండ్రి ఈ కారును కొనుగోలు చేశారని, అది ఇంకా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌పైనే ఉందని పోలీసులు తెలిపారు.
మైనర్‌కు డ్రైవింగ్ లైసెన్సు కూడా లేదు. ఆదివారం నాడు పోర్షే కారులో ప్రయాణిస్తూ ఒక మోటారు సైకిలును బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించిన విషయం విదితమే