Train Ticket | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ప్రయాణానికి 5 నిమిషాల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు..!

Train Ticket | భారత్‌లో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. నిత్యం కోట్లాది మంది ప్రజలను గమ్యస్థానం చేరుస్తున్నది. ఎక్కువ భద్రత, తక్కువ ఖర్చుతో పాటు సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లేందుకు రైలునే ఎంచుకుంటారు. అయితే, రైలులో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్‌ చేసుకునే విషయం తెలిసిందే.

Train Ticket | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ప్రయాణానికి 5 నిమిషాల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు..!

Train Ticket | భారత్‌లో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. నిత్యం కోట్లాది మంది ప్రజలను గమ్యస్థానం చేరుస్తున్నది. ఎక్కువ భద్రత, తక్కువ ఖర్చుతో పాటు సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లేందుకు రైలునే ఎంచుకుంటారు. అయితే, రైలులో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్‌ చేసుకునే విషయం తెలిసిందే. లేకపోతే బెర్తులు లేక ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అప్పటికప్పుడు వెళ్లేవారి కోసం రైల్వేశాఖ తత్కాల్‌ టికెట్లను సైతం జారీ చేస్తుంటుంది. ఈ తత్కాల్‌ టికెట్లు ప్రయాణానికి ఒక రోజు ముందుగా జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటికప్పుడు ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే టికెట్‌ దొరుకుతుందా..? బెర్తులు ఉంటాయా? ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చా? అనే సందేహాలు చాలామందిలోనే ఉన్నాయి. అయితే, ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు సైతం ట్రైన్‌ టికెట్‌ను బుక్‌ చేయడం సాధ్యమ అంటే.. సాధ్యమేనని రైల్వేశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత.. మీరు ఎక్కబోయే రైలును బట్టి సీట్‌ని కన్ఫర్మ్‌ చేసుకోవచ్చు. వాస్తవానికి చాలామంది ప్రయాణం చేయాల్సిన రోజున టికెట్లు క్యాన్సిల్‌ చేసుకునేవారుంటారు. ఇలా క్యాన్సిల్‌ అయిన టికెట్లను వేరే ప్రయాణికులకు కేటాయించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ప్రతి రైలు టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే రెండు చార్జ్‌లను రెడీ చేస్తుంది. రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు ఫస్ట్‌ చార్ట్‌ ప్రిపేర్‌ అవుతుంది. రెండోచార్ట్‌ రైలు బయలుదేరే ముందు రెడీ అవుతుంది. గతంలో రైలు బయలుదేరేందుకు అరగంట ముందు మాత్రమే టికెట్‌ను బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉండేది. తాజాగా ఐదు నిమిషాల వ్యవధిలోనే బుక్‌ చేసుకునేందుకు రైల్వేశాఖ అవకాశం కల్పిస్తున్నది. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో టికెట్‌ని బుక్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నది.

ఆన్‌లైన్‌ టికెట్‌ ఎలా బుక్‌ చేయాలంటే..

ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత మీరు ఏ రైలులో ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ రైలులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయా..? లేదా చూసుకోవాలి. ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. చార్ట్ వేకెన్సీ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. లేకపోతే ఆన్‌లైన్‌ ఛార్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేసుకోవచ్చు. ట్రైన్ పేరు, ట్రైన్ నంబర్, తేదీ, ఏ స్టేషన్‌లో రైలు ఎక్కుతారో ఆ స్టేషన్ పేరు ఎంటర్ చేసి ట్రైన్ చార్ట్‌పై ప్రెస్‌ చేయాలి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్ క్లాస్‌లవారీగా చార్ట్ కనిపిస్తుంది. అందులో ఎక్కడైనా సీట్లు ఏమైనా ఖాళీగా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సీట్లు లేకపోతే చార్ట్‌లో సున్నా అని చూపిస్తుంది. కోచ్ నంబర్, బెర్త్ సహా అన్ని వివరాలు ఆ చార్ట్‌లో కనిపిస్తాయి. రైల్వేస్టేషన్‌లో ఉండగా ట్రైన్ వచ్చే ఐదు నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.