Delhi Liquor Case | లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు విచారణ వాయిదా.. వర్చువల్‌గా హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. ఈ విచారణకు తీహర్ జైలు నుంచి బీఆరెస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం విచారణ కొనసాగించింది. ఈ విచారణకు తీహర్ జైలు నుంచి బీఆరెస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
మరోవైపు సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈనెల 27న విచారణ జరుగనుంది. ఈ కేసులో ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 23వరకు న్యాయస్థానం సమయమిచ్చింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా, తీహార్ జైలులో ఏప్రిల్ 24న సీబీఐ అరెస్టు చేసింది. కవిత బెయిల్ ప్రయత్నాల్లో భాగంగా సుప్రీంకోర్టులో జరిగే విచారణ కీలకంగా మారింది.